Arjun Tendulkar : ఆఖరి మ్యాచ్‌లోనైనా సచిన్ కొడుక్కి అవకాశం ఇవ్వండయ్యా.. వాటర్ బాయ్‌గా మిగిలిపోయిన అర్జున్ టెండూల్కర్..
ఆఖరి మ్యాచ్‌లోనైనా సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కు లక్నో సూపర్ జెయింట్స్ అవకాశం ఇస్తుందా? ఇవ్వదా? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
LSG last match in IPL 2026 Season can Arjun Tendulkar get a chance against pbks
- ఐపీఎల్2026 సీజన్లో చివరి మ్యాచ్ ఆడనున్న లక్నో
- కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా సచిన్ కొడుక్కి అవకాశం దక్కేనా?
- సీజన్‌కు ముందు ముంబై నుంచి ట్రేడింగ్‌లో దక్కించుకున్న లక్నో
- ఇప్పటి వరకు వాటర్ బాయ్‌గానే మిగిలిన పోయిన అర్జున్ టెండూల్కర్
Arjun Tendulkar : ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు వచ్చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ నేడు (మే 23 శనివారం) పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. పంజాబ్‌కు ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం ముఖ్యం. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించిన లక్నో జట్టు తమ హోమ్ గ్రౌండ్లో జరగనున్న ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి.. గెలుపుతో సీజన్‌ను ముగించాలని భావిస్తోంది. ఆఖరి మ్యాచ్‌లోనైనా లక్నో జట్టు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రానీ అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం ఇస్తుందా లేదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అర్జున్ టెండూల్కర్ 2023లో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరుపున అరంగ్రేటం చేశాడు. మూడు సీజన్ల పాటు అతడు ఆ జట్టుతోనే ఉన్నప్పటికి కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం 5 మ్యాచ్‌లే ఆడాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. ఓ మ్యాచ్‌లో మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం రాగా.. 13 పరుగులు చేశాడు.
SRH : టీ20ల్లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్రపంచంలోనే ఏకైక జట్టుగా..
ఇక ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ టెండూల్కర్‌ను ట్రేడింగ్ ద్వారా 30 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది. దీంతో ఈ సీజన్లో అర్జున్ టెండూల్కర్‌కు మరిన్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం లభిస్తుందని, పంత్ అండగా ఉంటాడని అంతా భావించారు.
కట్ చేస్తే 13 మ్యాచ్‌లు గడిచిపోయాయి. లక్నో జట్టు ఎప్పుడో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది. అయినప్పటికి కూడా ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం అర్జున్‌కు రాలేదు. కేవలం వాటర్ బాయ్‌గానే మిగిలిపోయాడు.
SRH : టీ20ల్లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్రపంచంలోనే ఏకైక జట్టుగా..
దీన్ని చూస్తున్న సచిన్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. సీజన్ ఆరంభంలో ఎలాగూ ఛాన్స్ ఇవ్వలేదు, ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించిన తరువాత కూడా ఇవ్వడం లేదు. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అవకాశాలు ఇచ్చినప్పుడే కదా తనను తాను ప్రూవ్ చేసుకుంటాడని అంటున్నారు.
