Girl raped : బాలికపై ఆరునెలలుగా ఎనిమిది మంది పాశవిక అత్యాచారం..

త‌మిళ‌నాడులో 16ఏళ్ల బాలిక‌పై ఆరునెలలుగా జరుగుతున్న అత్యాచార కాండ జరిగింది. ఇద్ద‌రు బంధువులు..77 ఏండ్ల పొరుగింటి వృద్ధుడు తో పాటు ఎనిమిది మంది బాలికపై అత్యాచారం పాల్పడ్డారు.

Girl raped : బాలికపై ఆరునెలలుగా ఎనిమిది మంది పాశవిక అత్యాచారం..

77 Year Old Neighbour, Relatives For Raped Girl

Updated On : January 11, 2022 / 5:55 PM IST

77 year old neighbour, relatives for raped girl : చెల్లిలాంటి చిన్నారి అనీ లేదు. కాళ్లు కాళ్లు చాపుకున్నా అవ్వాలేదు. ఆడపుట్టుకపై జరిగే అనాగిక అత్యాచారాలు జరుగుతుంటే ఇది మనుషులు జీవించే సమాజమా? నరరూప రాక్షసులు జీవించే కాలమా? అనిపిస్తోంది. అత్యాచారం జరగని రోజంటూ లేదు. చెల్లి లేదు, తల్లీ లేదు.ఆడది అయితే చాలు అన్నట్లుగా పెచ్చరిల్లిపోతున్న అత్యంత దారుణ అఘాయిత్యాలు,అత్యాచారాలు,లేత శరీరాలు ఛిధ్రమైపోతున్న అత్యంత పాశవికత్వం మనుషుల్లో పెచ్చరిల్లిపోతోందనటానికి మరో బాలిక జీవితం నలిగిపోయింది.

Read more : Hyderabad : కోకాపేటలో దారుణం.. సగం కాలిన మహిళ మృతదేహం గుర్తింపు

త‌మిళ‌నాడులోని విల్లుపురం జిల్లా గింజీ గ్రామంలో 16ఏళ్ల బాలిక‌పై ఆరునెలలుగా జరుగుతున్న అత్యాచార కాండ జరిగింది. ఇద్ద‌రు బంధువులు..77 ఏండ్ల పొరుగింటి వృద్ధుడు తో పాటు ఎనిమిది మంది బాలికపై ఆరు నెలలుగా అత్యాచారానికి తెగబడ్డారు.ఈ విషయం బయటకు చెబితే నరికి చంపేస్తామని బెదరించి ఈ అత్యాచార కాండ సాగించారు ఎనిమిదిమంది మృగాళ్లు. ముక్కు పచ్చలారని ఆ బాలిక భయంతో నోరు విప్పలేదు. దాన్ని అలుసుగా చేసుకున్న మృగాళ్లు ఆమెకు నరకం చూపించారు. ఆరు నెల‌లుగా జరుగుతున్న ఈ దారుణానికి ఫలితంగా బాలిక గ‌ర్భం దాల్చటంతో బయటపడింది. దీంతో ఆ ఎనిమిది మంది మృగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read more : Karnataka Accident : అతివేగం,నిర్లక్ష్యానికి ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతి

బాధిత బాలిక త‌ల్లి చనిపోవటంతో ఆమెను గింజీలోని త‌న అత్త ఇంట్లో ఉంటోంది. స్ధానిక ప్ర‌భుత్వ స్కూల్లో చ‌దువుతోంది. కొద్దిరోజులుగా బాలిక అస్వ‌స్ధ‌త‌తో ఉండ‌టంతో బంధువులు ఆస్ప‌త్రికి తీసుకువెళ్లటంతో డాక్టర్ కు అనుమానం వచ్చి ప‌రీక్ష‌లు చేయగా గ‌ర్భ‌వ‌తని ఈ విషయం బయటపడింది. ఆమెను గట్టిగా అడుగగా జరిగిన విషయం చెప్పటంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్ట్ చేశారు. కేసు విచారణ చేపట్టారు పోలీసులు.