Gold Prices: తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధరలు ఇవీ

శుక్రవారంతో పోలిస్తే, శనివారం నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాములకు బంగారం దాదాపు రూ.750 వరకు తగ్గింది. వెండి ధర కిలోకు రూ.1,600 తగ్గింది.

Gold Prices: తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధరలు ఇవీ

Gold Prices

Updated On : May 14, 2022 / 8:13 AM IST

Gold Prices: శుక్రవారంతో పోలిస్తే, శనివారం నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాములకు బంగారం దాదాపు రూ.750 వరకు తగ్గింది. వెండి ధర కిలోకు రూ.1,600 తగ్గింది. ఈరోజు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,670గా ఉంది. కిలో వెండి ధర రూ.63,4000గా ఉంది. తెలంగాణలోని మిగతా పట్టణాల్లో కూడా దాదాపు ఇవే ధరలు అమలవుతాయి. ఏపీలోని విశాఖ పట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.46,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670గా ఉంది. వెండి కిలో ధర రూ.63,400 గా ఉంది.

 

విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.46,450కాగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,670గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.63,400 గా ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,640కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,970 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670 గా ఉంది. హైదరాబాద్‌లో పది గ్రాముల ప్లాటినమ్ ధర రూ.23,730 గా ఉంది.