Freight Trains: వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన గూడ్స్ రైళ్లు!

గూడ్స్ రైళ్లంటే ఎలా వెళ్తాయో మనకి తెలిసిందే. సరుకు రవాణా చేస్తూ దేశాన్ని చుట్టేసే ఈ రైళ్లు మహా అయితే యాభై, అరవై కిలోమీటర్ల వేగం వెళ్తే అబ్బో అనుకుంటాం.

Freight Trains: వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన గూడ్స్ రైళ్లు!

Goods Trains At A Speed Of One Hundred Kilometers

Updated On : May 30, 2021 / 11:57 AM IST

Freight Trains: గూడ్స్ రైళ్లంటే ఎలా వెళ్తాయో మనకి తెలిసిందే. సరుకు రవాణా చేస్తూ దేశాన్ని చుట్టేసే ఈ రైళ్లు మహా అయితే యాభై, అరవై కిలోమీటర్ల వేగం వెళ్తే అబ్బో అనుకుంటాం. దూసుకెళ్తుందనే పేరున్న రాజధాని ఎక్స్ ప్రెస్ కూడా పేరుకి 130 కిమీ వేగం ఉంటుంది కానీ అది మహా అయితే ఎనభై-తొంబై కిమీ వేగంతోనే ప్రయాణిస్తుంది. కానీ.. ఇప్పుడు రోజులు మారాయి. గూడ్స్ రైళ్లు కూడా రాజధాని ఎక్స్ ప్రెస్ ను మించి వంద కిమీ వేగంతో దూసుకెళ్తున్నాయి. మన దేశంలో గూడ్స్ రైళ్లు కూడా అప్డేట్ అవుతున్నాయి.

ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (EDFC)లో శనివారం మూడు రైళ్లు సగటున 99 కిలోమీటర్ల వేగంతో నడిచి సరికొత్త రికార్డును సృష్టించాయి. ఇందులో ఒక రైలు గంటకు 99.38 కిలోమీటర్ల రికార్డు వేగంతో ప్రయాణించి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ కంటే వేగంగా సరుకు రవాణా రైలు గమ్యాన్ని చేరింది. ఇప్పటి వరకు అత్యంత వేగంగా నడిచిన రైలుగా రాజధాని ఎక్స్ ప్రెస్ పేరిట 97.85 కిమీ రికార్డు ఉంది. కాగా ఇప్పుడు గూడ్స్ రైలు ఆ రికార్డును వెనక్కి నెట్టి సరికొత్త రికార్డును నమోదు చేసింది.

గత ఏడాది డిసెంబర్ 29న ప్రధాని నరేంద్ర మోడీ ఈడీఎఫ్‌సీని జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. అందులోని ఈడీఎఫ్ సీ గూడ్స్ ట్రైన్ శనివారం న్యూ ఖుర్జా- న్యూ భావ్‌పూర్‌ మధ్య 351 కిమీ దూరాన్ని కేవలం 3.20 గంటల్లో దుమ్మురేపుతూ దూసుకెళ్లింది. ఇప్పటి వరకు 137 రైళ్లు ఈ మార్గంలో 90 కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణించగా.. తాజాగా ప్రయాణించిన 99.38 వేగం అన్నిటిని అధిగమించేసింది. ఇక వెస్ట్రన్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌లో 306 కిలోమీటర్ల రేవారి – మాదర్‌ విభాగంలోనూ గూడ్స్‌ ట్రైన్లు కూడా 90 కిమీ వేగాన్ని అందుకోవడం విశేషమని అధికారులు చెప్తున్నారు.