గోడదూకి హోటల్ లోకి వచ్చిన సింహం

గోడదూకి హోటల్ లోకి వచ్చిన సింహం

Updated On : February 10, 2021 / 7:17 PM IST

Gujarat : Lion Enters 5 star hotel in Junagadh,whatch video : స్టార్ హోటళ్లలోకి సెలబ్రిటీలు వచ్చి వెళ్లటం కామన్ గా జరుగుతూ ఉంటుంది. కానీ గుజరాత్, జూనాఘడ్ లోని ఒక హోటల్ లోకి అనుకోని అతిధి వచ్చి వెళ్లటం ఇప్పుడు స్ధానికంగా కలకలం రేపుతోంది.  రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న సరోవర్ హోటల్ పోర్టికోలోకి ఈనెల 8వ తేదీ తెల్లవారు ఝామున5 గంటల సమయంలో సింహం గోడ దూకి లోపలికి వెళ్లింది.

ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈప్రాంతానికి సింహం తెల్లవారు ఝూమున రావటం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ వీడియోను ఉదయ్ కచ్చి అనే ట్విట్టర్ యూజర్ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.

ఈ మధ్య కాలంలో సింహాలు జునాఘడ్‌కు వచ్చిపోవడం సాధారణం అయిపోయింది  అంటూ వ్యాఖ్యానిస్తూ  అతడు షేర్‌ చేసిన ఈ వీడియోలో సింహం హెటల్‌కు గోడపై నుంచి దూకి లోపలికి వెళ్లి మళ్లీ అదే గొడపై నుంచి తిరిగి వెళుతున్నట్లు కనిపించింది. సింహం హోటల్ లోకి వెళ్లి కొంతమేర కలియ తిరిగింది. మళ్లీ అదే గోడపై నుంచి దూకి తిరిగి వెళుతున్నట్లు వీడియోలో కనిపించింది.

ఈ వీడియోపై అటవీశాఖ అధికారి సుశాంత్ నందా స్పందిస్తూ…‘ఇది పెద్ద సమస్య కాదు.. లోపలికి వెళ్లాలంటే సెక్యూరిటీ గేట్‌ తెరవాల్సిన అవసరం లేదు’ అంటూ ఈ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు.

జూనాఘడ్ ప్రాంతం గిర్నార్ కొండలకు సమీపంలో ఉన్నందున సింహాలు తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆ సమయంలో హోటల్ లో ఎవరూ బయటకు రాకపోవటం చాలా అదృష్టం అని మరోక నెటిజన్ వ్యాఖ్యానించారు.

జనాఘడ్ సింహాల అభయారణ్యమైన గిర్ కొండలకు సమీపంలో ఉంటుంది. గతంలో కూడా ఇలా సింహాలు రాత్రిపూట రోడ్లపైకి వచ్చి స్వేఛ్ఛగా తిరిగి వెళ్లినఘటనలు ఉన్నాయని స్ధానికులు చెపుతున్నారు.