PSPK 28: పవన్ తో హరీష్ సినిమా.. ప్రకటనకు కారణం ఓ అభిమానేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి మాసివ్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. అందుకే పవన్ కూడా హరీష్ శంకర్ మీద ప్రత్యేక ఆసక్తి చూపిస్తాడు. ఆ సినిమా తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని చాలాసార్లు ప్రచారం జరగగా త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ మీదకి వెళ్లనుంది.

PSPK 28: పవన్ తో హరీష్ సినిమా.. ప్రకటనకు కారణం ఓ అభిమానేనా?

Pspk 28

Updated On : June 9, 2021 / 11:54 AM IST

PSPK 28: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి మాసివ్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. అందుకే పవన్ కూడా హరీష్ శంకర్ మీద ప్రత్యేక ఆసక్తి చూపిస్తాడు. ఆ సినిమా తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని చాలాసార్లు ప్రచారం జరగగా త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ మీదకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాపై దర్శకనిర్మాతల నుండి ప్రకటనలు కూడా వచ్చేశాయి. అయితే.. నిజానికి మరికొంత సమయం తీసుకొని సినిమాపై ప్రకటన, ఫస్ట్ లుక్ విడుదల చేయాలని భావించారు. కానీ.. సడన్ గా సినిమా అనౌన్స్ చేయాల్సి వచ్చింది.

హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ క్రేజీ కాంబో సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ మంచి సమయం చూసి విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే అసలు ఇంత సడెన్ గా అప్డేట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఓ అభిమాని చేసిన పనిగా తెలుస్తుంది. ఓ అభిమాని ఈ క్రేజీ ప్రాజెక్టుపై పోస్టర్స్ తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు వీటిని వైరల్ చేయగా చివరికి మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చినట్లుగా తెలుస్తుంది.

వైరల్ గా మారిన పోస్టర్స్ పై స్పందించిన దర్శకుడు హరీష్ త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పగా మైత్రీ మేకర్స్ ఓ ట్వీట్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాకి సంబంధించి ఉగాది రోజున ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ విడుదల చేయాలని భావించగా.. కరోనా కారణంగా ఆ నిర్ణయం వాయిదా పడగా సరైన సమయంలో అధికారిక ఖాతాల ద్వారా సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తామని చెప్పారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొట్టే అనేక వార్తలు, ఫొటోలకు మేకర్స్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.