Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టులో ఊరట

ఈ పిటిషన్లను శివశంకర్ శర్మ దాఖలు చేశారు. వీటిని జార్ఖండ్ హైకోర్టు జూన్ 3న విచారణకు స్వీకరించింది. గనుల లీజులను అక్రమంగా మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు. 2010లో గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కాంట్రాక్టుల మంజూరుపై కూడా దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ పిటిషన్లపై విచారణను నిలిపేయాలని జార్ఖండ్ ప్రభుత్వంతోపాటు సొరేన్ కూడా అప్పీలు చేశారు

Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టులో ఊరట

hemant soren gets relief by supreme court

Updated On : August 17, 2022 / 7:53 PM IST

Hemant Soren: మనీలాండరింగ్‭కు పాల్పడుతున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేత ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‭కు ఊరట లభించింది. బూటకపు కంపెనీలు ఉన్నాయని, ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారనే విషయాలను ఆధారంగా చేసుకుని ఆయనను దర్యాప్తు చేయించాలని జార్ఖండ్ హైకోర్టులో ఈడీ మూడు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై తదుపరి చర్యలను నిలిపేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

ఈ పిటిషన్లను శివశంకర్ శర్మ దాఖలు చేశారు. వీటిని జార్ఖండ్ హైకోర్టు జూన్ 3న విచారణకు స్వీకరించింది. గనుల లీజులను అక్రమంగా మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు. 2010లో గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కాంట్రాక్టుల మంజూరుపై కూడా దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ పిటిషన్లపై విచారణను నిలిపేయాలని జార్ఖండ్ ప్రభుత్వంతోపాటు సొరేన్ కూడా అప్పీలు చేశారు. ఈ అపీళ్ళపై జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఈ పిల్స్‌పై విచారణ జరపరాదని ఆదేశించింది.

Nitish-Tejashwi cabinet: బిహార్ మంత్రుల్లో 72% మందిపై క్రిమినల్ కేసులు: రిపోర్ట్