ఫొటో‌షాప్ అక్కర్లేదు: అన్ని ఫొటోలు ఒకేసారి ఎడిట్ చేయొచ్చు!

  • Published By: srihari ,Published On : June 4, 2020 / 09:41 AM IST
ఫొటో‌షాప్ అక్కర్లేదు: అన్ని ఫొటోలు ఒకేసారి ఎడిట్ చేయొచ్చు!

Updated On : June 4, 2020 / 9:41 AM IST

ఫొటోలను ఎడిట్ చేస్తున్నారా? అన్ని ఫొటోలను క్రాపింగ్ చేసి ఒకే సైజులోకి మార్చాలనుకుంటున్నారా? అయితే సింపుల్‌గా మల్టీపుల్ ఫొటోలను ఒకేసారి క్రాపింగ్ చేసుకోవచ్చు. ఒక్కో ఫొటో క్రాపింగ్ చేయాలంటే సమయంతో కూడిన పని. ఫొటోలకు వాటర్ మార్క్ అప్లయ్ చేయాలంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. కానీ, ఒకే సమయంలో 30 ఫొటోలను బ్యాచ్ ఎడిట్ చేసుకోవచ్చు. అన్ని ఫొటోలను ఒకేసారి ఎడిటింగ్ చేయడం ద్వారా సమయంతో పాటు శక్తి ఆదా అవుతుంది. అన్ని ఫొటోలను ఒకేసారి ఎలా ఎడిట్ చేయవచ్చో ఓసారి చూద్దాం..
GNU

విండోస్, మ్యాక్OS, క్రోమ్ OS.. ఈ మూడు ప్లాట్ ఫాంలపై కొన్ని టూల్స్ ద్వారా మీ ఫొటోలు, ఇమేజ్‌లను సింపుల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఫొటోలను ఒకే సమయంలో ఎడిటింగ్ చేసే థర్డ్ పార్టీ టూల్ ఒకటి అందుబాటులో ఉంది. ఎడిటింగ్ టూల్స్ చాలావరకు పెయిడ్ వెర్షన్ అధికంగా అందుబాటులో ఉన్నాయి. లేదంటే.. ఫ్రీ సాఫ్ట్ వేర్ కూడా ఆన్ లైన్ మార్కెట్లో లభిస్తున్నాయి. 

విండోస్‌లో బ్యాచ్ ఎడిటింగ్ :
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఓపెన్ సోర్స్ ఫొటోషాప్ రీప్లేస్ మెంట్ నుంచి ప్లగిన్ వాడొచ్చు. అదే.. GNU Image Manipulation Program (GIMP). ఇది ఉచితంగా పొందొచ్చు. ఓపెన్ సోర్స్ డెస్క్ టాప్ ప్రొగ్రామ్. ఫొటోలను క్రాపింగ్ చేయడం, కలర్ అడ్జెస్ట్ మెంట్, ఎఫెక్టులు యాడ్ చేయడం, లేయర్లు ఇలా మరెన్నో ఎడిటింగ్ చేయొచ్చు. 

Batch Image Manipulation Program (BIMP) :

GIMP కోసం ఈ ఫ్రీ ప్లగిన్ వాడొచ్చు. ఓపెన్ సోర్స్ డెస్క్‌టాప్ సాఫ్ట్ వేర్‌లో బ్యాచ్ ఎడిటింగ్ యాడ్ చేస్తుంది. మీరు ముందుగా GIMP ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు టూల్స్ మీరు ఇన్ స్టాల్ చేసుకున్నాక ఒకేసారి మల్టీపుల్ ఫొటోలను ఎడిటింగ్ చేసుకోవచ్చు. 

Step 1: GIMP ఓపెన్ చేయండి. main menu పై click చేయండి. 
Step 2: drop-down menu నుంచి Batch Image Manipulation సెలెక్ట్ చేయండి.
Step 3: Manipulation Set కింద మీకో పాప్ అప్ విండో కనిపిస్తుంది. Add buttonపై క్లిక్ చేయండి.
Step 4: pop-up menu పై కనిపించే manipulation ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
GNIM

ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది. మీరు ఎంచుకునే manipulation బట్టి సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. Resize, Crop, Flip or Rotate, Color Correction, Sharp or Blur, Add a Watermark, Change Format and Compersion, Rename With a Pattern, Other GIMP Procedure ఇలా అన్ని మీకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత GIMPలో Ok బటన్ పై క్లిక్ చేసి Save చేస్తే సరిపోతుంది. 
GIMF

Step 5 : మరో manipulation యాడ్ చేయాలంటే Add buttion పై మరోసారి క్లిక్ చేయండి. 
Step 6 : Input files, Options కింది కనిపించే Add images బటన్‌పై క్లిక్ చేసి.. ఫొటో ఎంపిక చేసి బల్క్ ఎడిట్ చేయండి.
Step 7 : Output ఫోల్డర్ ఎంపిక చేయండి. 
Step 8 : బ్యాచ్ ఎడిట్ ప్రాసెస్ బిగిన్ చేసేందుకు Apply బటన్ పై Click చేయండి. 
మ్యాక్ ఓఎస్, క్రోమ్ ఓఎస్ లో కూడా ఇదే మాదిరిగా ఫొటోలను ఒకేసారి ఎడిటింగ్ చేసుకోవచ్చు. 

Read: ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్: పాత చెత్త పోస్టులను హైడ్ చేయండిలా!