అలవాటు మార్చుకోవాలంటే ఎంత టైం పడుతోందో తెలుసా..

అలవాటు మార్చుకోవాలంటే ఎంత టైం పడుతోందో తెలుసా..

cigarettea

Updated On : February 4, 2021 / 4:22 PM IST

Habit: రెగ్యూలర్ గా చేసే దాన్నే అలవాటు అంటాం. అలాంటిది దాన్ని మానేసి అదే స్థానంలో ఇంకొకటి చేర్చడమంటే అంత సులువు కాదు. ఉదహరణకు స్మోకింగ్ తీసుకుందాం. అనుకున్నంత ఈజీగా దాన్ని వదలలేరు. ఒకవేళ వదిలేయాలనుకుంటే ఎంత టైం పడుతుందో తెలుసా.. దీనిపైన ఓ స్టడీ నిర్వహించారు. దాదాపు ఒకటి మానేసి ఇంకొకటి ఏదైనా అలవాటు చేసుకోవాలంటే 60రోజుల సమయం పడుతుంట.

మీ అలవాట్లు బట్టి మీరేంటో చెప్పేయొచ్చు..
మనుషులు అలవాట్లకు బానిసలు. అవి లేకుండా వారి లైఫ్ స్టైల్ ఉండదంటే ఉండదు. అన్ని అలవాట్లు సమానంగా ఉంటాయని కాదు. పడుకునే ముందు చదువుకోవడం, ప్రతి రోజూ ఉదయం లేవగానే బ్రష్ చేసుకోవడం లాంటివి గొప్ప అలవాట్లు. మరి రోజూ ఒక సిగరెట్ ప్యాకెట్, అర్ధరాత్రి 2గంటల వరకూ టీవీ చూడటం మాత్రం మంచివి అని చెప్పలేం కదా.

అలవాట్లు అనేవి మనుషులను విడగొట్టడంతో పాటు కలుపుతాయి కూడా అని సైకాలజిస్టులు అంటున్నారు. థెరపీ ప్రాక్టీస్ లో భాగంగా కొన్ని అలవాట్లు మనిషిని మారుస్తాయని తెలిసింది. రెగ్యూలర్ రిపిటీషన్ కారణంగా ఆటోమేటిక్ గా అలవాట్లు, ప్రవర్తన విధానం మారిపోతుందట. అప్పుడు మన ప్రమేయం లేకుండానే వాటిని చేసేస్తాం. తద్వారా ఫ్రీ మైండ్ తో చేయగలం.

1950ల నుంచి చేసిన పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే.. ఏదైనా అలవాటు చేసుకోవాలన్నా.. మార్చుకోవాలన్నా 21రోజుల సమయం సరిపోతుందట. 2009లో లండన్ కాలేజీ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చర్లు 96మందిపై 12రోజుల పాటు స్టడీ నిర్వహించారు. అలా 12వారాల పాటు చేసిన పనిని సింపుల్ గా అలవాటుగా మారిపోయింది. కొందరిలో మాత్రం కొంచెం అటూఇటుగానే ఉండింది.

ఈ పరిశోధనలు చేసిన రీసెర్చర్ ఒకరు మాట్లాడుతూ.. అలవాటుగా మారడానికి 21రోజులు లేదా 60రోజుల సమయం పడుతుందని అన్నారు. కొందరిలో అలవాటు చేసుకోలేమేమో అనే సందేహంతో ఇంకా ఎక్కువ సమయం పడుతుందని వెల్లడించారు. బలంగా నమ్మితే 21రోజులలోనే అలవరచుకోవచ్చని.. దీని కోసం ఆన్ లైన్ లో సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కూడా ఉన్నాయని సూచిస్తున్నారు నిపుణులు.