Chennai : నా డెత్ సర్టిఫికేట్ రద్దు చేయండి.. చెన్నైలో 10 నెలలుగా ఓ వ్యక్తి పోరాటం..

1996 నుంచి కనిపించకుండా పోయిన వ్యక్తి 2022లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. చనిపోయాడనుకున్న కుటుంబసభ్యులు అతని డెత్ సర్టిపికేట్ తీసుకున్నారు. దానిని క్యాన్సిల్ చేయమని వేడుకుంటున్నా అధికారులు వారి మొర ఆలకించట్లేదు. చెన్నైలో ఈ సంఘటన జరిగింది.

Chennai :   నా డెత్ సర్టిఫికేట్ రద్దు చేయండి.. చెన్నైలో  10 నెలలుగా ఓ వ్యక్తి పోరాటం..

Chennai

Updated On : May 16, 2023 / 2:55 PM IST

An Old Man’s Story : అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. 25 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడో తెలీదు. 10 నెలల క్రితం హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. చనిపోయాడనుకున్న కుటుంబసభ్యులకు షాక్ ఇచ్చాడు. అతని డెత్ సర్టిఫికేట్ రద్దు చేయమని కుటుంబం పోరాడుతున్నా ఫలితం లేకుండా పోయింది.

Mumbai: ఇంట్లోంచి 40 లక్షల నగలు పోయినా పట్టించుకోని కుటుంబం.. ఎందుకో తెలిసి నోరెళ్లబెట్టిన పోలీసులు.. ఇంతకీ నగలేమయ్యాయంటే!

తిరుపత్తూర్ జిల్లా అంబూరు చిన్నమలయంపట్టు గ్రామానికి చెందిన శ్రీరాములు, సావిత్రిలకు ఇద్దరు కొడుకులు. ఆర్ధిక బాధలతో శ్రీరాములు 1996 లో ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. అతని జాడ కోసం కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నం లేదు. ఇక అతను చనిపోయి ఉంటాడని కుటుంబసభ్యులు 2003 లో మున్సిపాలిటీ నుంచి డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. అతను పనిచేసిన కంపెనీ నుంచి వచ్చిన డబ్బుతో అప్పులు కూడా తీర్చేసారు.

African Grey Parrot: కనిపించకుండా పోయిన చిలుక.. కనిపెడితే రూ.50 వేల బహుమతి

ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్ లో అనూహ్యమైన సంఘటన జరిగింది. చనిపోయాడనుకున్న శ్రీరాములు ఊళ్లో ప్రత్యక్షమయ్యాడు. తను ఇన్ని సంవత్సరాలుగా పొరుగూరిలో ఉన్నానని తనను క్షమించమని కుటుంబ సభ్యులను వేడుకున్నాడు. ఇక అతని డెత్ సర్టిఫికేట్ క్యాన్సల్ చేయమంటూ అతని కుటుంబ సభ్యులు తహసీల్దార్, కలెక్టర్ ఇతర అధికారుల చుట్టూ 10 నెలలుగా తిరుగుతున్నారు. అయినా ఫలితం లేకపోయింది. తమ ఇంటి పెద్ద తిరిగి వచ్చినందుకు సంతోషించాలా? అతను చనిపోయిన వారి జాబితాలో ఉన్నందుకు బాధపడాలో తెలియని అయోమయంలో ఆ ఫ్యామిలీ కొట్టుమిట్టాడుతోంది.