Sitara Ghattamaneni: ఐ మిస్ యూ తాతయ్య.. కృష్ణ మృతితో సితార ఎమోషనల్ పోస్ట్ ..

సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాతయ్య కృష్ణతో ఉన్న ఫొటోను షేర్ చేసి మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నా తాతయ్య అంటూ బావోద్వేగానికి గురయ్యారు. ఇకపై వారాంతపు భోజనాలు ఇంతకు ముందులా ఉండవు. మీరు నాకెన్నో విలువైన విషయాలు నేర్పించారు. నన్నెప్పుడూ నవ్వించేవారు. ఇప్పటి నుంచి అవన్నీ మీ జ్ఞాపకాలుగా నాకు గుర్తుండిపోతాయి అంటూ బావోద్వేగ పోస్టు పెట్టారు.

Sitara Ghattamaneni: ఐ మిస్ యూ తాతయ్య.. కృష్ణ మృతితో సితార ఎమోషనల్ పోస్ట్ ..

sitara

Updated On : November 16, 2022 / 2:50 PM IST

Sitara Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ మృతి తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు భారీగా తరలివచ్చి కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. సినీ ప్రముఖులు కృష్ణతో తమకున్న అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబ సభ్యులు కృష్ణ మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తాతయ్య మరణం పట్ల మహేష్ బాబు కుమార్తె సితార భావోద్వేగానికి గురయ్యారు. తన తాతయ్యతో కలిసి గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు.

Krishna : చివరిసారిగా తాతయ్యకి నివాళ్లు అర్పించిన గౌతమ్ అండ్ సితార..

సితార తన ఇన్ స్టాగ్రామ్‌లో తాతయ్య కృష్ణతో ఉన్న ఫొటోను షేర్ చేసి. మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నా తాతయ్య అంటూ బావోద్వేగానికి గురయ్యారు. ఇకపై వారాంతపు భోజనాలు ఇంతకు ముందులా ఉండవు. మీరు నాకెన్నో విలువైన విషయాలు నేర్పించారు. నన్నెప్పుడూ నవ్వించేవారు. ఇప్పటి నుంచి అవన్నీ మీ జ్ఞాపకాలుగా నాకు గుర్తుండిపోతాయి. మీరు నా హీరో.. ఏదో ఒకరోజు మీరు గర్వపడే స్థాయికి నేను చేరుకుంటా తాతగారు అంటూ ఇన్ స్టాగ్రామ్ లో రాశారు.

CM Jagan : కృష్ణ పార్థివదేహానికి నివాళు అర్పించిన సీఎం జగన్..

సితార పోస్టుకు నెటిజన్లు ‘ బి స్ట్రాంగ్ సీతూ పాప’, మీ తాతయ్య ఎప్పుడూ  మన మనస్సులో చిరస్థాయిగా ఉంటారు అంటూ యూజర్లు కామెంట్స్ జత చేస్తున్నారు. ఇదిలాఉంటే పద్మాలయ స్టూడియోలో ఉంచిన కృష్ణ భౌతికకాయాన్ని మహేష్ బాబు కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలు సందర్శించి నివాళులర్పించారు.

 

View this post on Instagram

 

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)