పవన్‌కి నాలుగో భార్య అవుతానంటున్న అషూ.. మాటలు చాలవంటున్న హిమజ..

పవన్‌కి నాలుగో భార్య అవుతానంటున్న అషూ.. మాటలు చాలవంటున్న హిమజ..

Updated On : March 2, 2021 / 7:18 PM IST

Pawan Kalyan – Ashu Reddy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. యూత్ లో ఆయనకుండే క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. ఇక ఇండస్ట్రీ విషయానికొస్తే నితిన్‌తో స్టార్ట్ చేసి చెప్పుకుంటూపోతే ఆ లిస్ట్ చాలా పెద్దదే అవుతుంది. ఒక్కసారి తమ అభిమాన నటుణ్ణి చూసినా, ఫొటో తీసుకున్నా జన్మ ధన్యమైపోతుందనే ఫీలయ్యేవాళ్లు చాలామంది ఉన్నారు.

అలాంటిది, పవన్ తో మాట్లాడడం, ఫొటో తీసుకోవడం, తమ క్షేమాన్ని కాంక్షిస్తూ అభిమాన నటుడి దగ్గరినుండి లెటర్ రావడం వంటివి జరిగితే వారి ఆనందానకి అవధుల్లేకుండా పోతాయి.. బిగ్ బాస్ ఫేం అషూ రెడ్డి, యాక్ట్రెస్ హిమజ ఇద్దరిదీ ఇదే ఫీలింగ్ ఇప్పుడు..

పవన్ కళ్యాణ్ షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలోనే అషూ నటిస్తున్న సినిమా కూడా షూటింగ్ జరుగుతోంది. దీంతో అమ్మడికి తన అభిమాన నటుణ్ణి కలిసే ఛాన్స్ దొరికింది. పవన్ తో తీసుకున్న ఫొటో షేర్ చేసింది.. ‘‘నా దేవుడిని మళ్లీ కలుసుకున్నాను. ఆయన నాతో పాటు నేను వేసుకున్న టాటూ కూడా గుర్తుందని చెప్పారు. టీ ఆఫర్ చేశారు.. ఇద్ద‌రం కలిసి 2 గంటలసేపు మాట్లాడుకున్నాం. నా ఆనందాన్ని మాట‌ల్లో చెప్ప‌లేను. తిరిగి వెళ్లేటప్పుడు ఓ స్వీట్‌ లెటర్‌ కూడా ఇచ్చారు. మీరు ఎప్పటికీ నా ఫస్ట్‌ లవ్‌ పవన్ కల్యాణ్‌’ అని పోస్ట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

‘అశ్విని (అష్షూ) గారికి, మీరు కోరుకున్నవన్నీ మీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నాను’ అని పవన్‌ రాసిన లెటర్ కూడా పోస్ట్ చేసిందామె. కాగా ఈ పోస్టుపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. వెల్లువెత్తుతున్నాయి. అయితే ఒక నెటిజ‌న్ మాత్రం షాకింగ్ ప్ర‌శ్న అడిగాడు.

‘ఒకవేళ పవన్‌ కళ్యాణ్ మీకు నాలుగో భార్యగా ఉండే అవకాశం ఇస్తే ఒప్పుకుంటారా?’ అని అడిగాడే. వెంటనే ‘ఓకే’ చెబుతానని బదులిచ్చి నెటిజ‌న్‌కు అదే స్థాయిలో షాక్ ఇచ్చింది. ఆషూ రిప్లైను స్క్రీన్ షాట్లు తీసి మరీ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు నెటిజ‌న్లు.. నాలుగో భార్య‌గా ఉండ‌డానికి త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని అషూ చెప్ప‌డం అనే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ ఫేమ్, నటి హిమజ జాక్ పాట్ కొట్టేసింది.. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హిమజ నటిస్తోంది. షూటింగ్ స్పాట్‌లో తన ఫేవరెట్ హీరోతో ఫొటో తీసుకుంది హిమజ.. పవన్ ‘‘హిమజ గారికి, మీకు అన్ని శుభాలు జరగాలని, ప్రొఫెషనల్‌గా ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ.. పవన్ కళ్యాణ్’’ అంటూ లెటర్ రాశారు. తన ఫీలింగ్ చెప్పడానికి పదాలు, ఎమోజీలు సరిపోవని పోస్ట్ చేసింది హిమజ.

 

 

View this post on Instagram

 

A post shared by Himaja? (@itshimaja)