David Warner on captaincy: నేను నేరస్థుడిని కాదు.. కనీసం అప్పీలు చేసుకునే హక్కు ఉండాలి: డేవిడ్ వార్నర్
‘‘నేను నేరస్థుడిని కాదు.. కనీసం అప్పీలు చేసుకునే హక్కు ఉండాలి’’ అంటూ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సారథ్యం వహించకుండా తనపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసేందుకు సమీక్ష జరపాలని కోరేందుకు అప్పీలు చేసుకునే అవకాశం కూడా దొరకడం లేదని అన్నాడు. నిషేధం ఎందుకు విధించాల్సి వస్తుందన్న విషయాన్ని తాను అర్థం చేసుకుంటానని, అయితే, జీవిత కాలం పాటు నిషేధం విధంచడం కఠిన చర్య అని చెప్పాడు. తాజాగా డేవిడ్ వార్నర్ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2018 మార్చిలో డేవిడ్ వార్నర్ సారథ్యంపై ఆస్ట్రేలియా క్రికెట్ శాశ్వత నిషేధం విధించింది.

David Warner on captaincy
David Warner on captaincy: ‘‘నేను నేరస్థుడిని కాదు.. కనీసం అప్పీలు చేసుకునే హక్కు ఉండాలి’’ అంటూ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సారథ్యం వహించకుండా తనపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసేందుకు సమీక్ష జరపాలని కోరేందుకు అప్పీలు చేసుకునే అవకాశం కూడా దొరకడం లేదని అన్నాడు.
నిషేధం ఎందుకు విధించాల్సి వస్తుందన్న విషయాన్ని తాను అర్థం చేసుకుంటానని, అయితే, జీవిత కాలం పాటు నిషేధం విధంచడం కఠిన చర్య అని చెప్పాడు. తాజాగా డేవిడ్ వార్నర్ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2018 మార్చిలో డేవిడ్ వార్నర్ సారథ్యంపై ఆస్ట్రేలియా క్రికెట్ శాశ్వత నిషేధం విధించింది.
అప్పట్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా జట్టు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిందని ఆరోపణలు రావడంతో దానిపై విచారణ జరిపిన ఆ జట్టు అధికారులు డేవిడ్ వార్నర్ పై ఆ నిషేధం విధించారు. అలాగే, అప్పట్లో సంవత్సరం పాటు ఏ అంతర్జాతీయ, దేశీయ మ్యాచు ఆడకుండా కూడా అతడిపై నిషేధం కొనసాగింది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తమ నిబంధనల్లో పలు సవరణలు చేసింది. క్రికెటర్లు అప్పీలు చేసుకునే వీలు కల్పించింది.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..