Drone Hub: గ్లోబల్ డ్రోన్ హబ్‌గా భారత్: మోదీ
దేశంలో డ్రోన్ల వినియోగం పెరుగుతోందని, భవిష్యత్తులో ఇండియా.. గ్లోబల్ డ్రోన్ హబ్‌గా మారతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. న్యూ ఢిల్లీలో శుక్రవారం జరిగిన ‘భారత్ డ్రోన్ మహోత్సవ్-2022’ను ఆయన ప్రారంభించారు.

Drone Hub
Drone Hub: దేశంలో డ్రోన్ల వినియోగం పెరుగుతోందని, భవిష్యత్తులో ఇండియా.. గ్లోబల్ డ్రోన్ హబ్‌గా మారతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. న్యూ ఢిల్లీలో శుక్రవారం జరిగిన ‘భారత్ డ్రోన్ మహోత్సవ్-2022’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రోన్ల వినియోగం గురించి మోదీ మాట్లాడారు. ‘‘వ్యవసాయం, రక్షణ, భద్రత, క్రీడలు, ఫిల్మ్ ఇండస్ట్రీ వంటి అనేక రంగాల్లో డ్రోన్లు ఉపయోగపడతాయి. భవిష్యత్తులో వీటి సేవలు మరింత పెరుగుతాయి. నేను కూడా అప్పుడప్పుడూ వివిధ విభాగాలను తనిఖీ చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తుంటా. డ్రోన్ టెక్నాలజీ చాలా అద్భుతమైంది. డ్రోన్ ఇండస్ట్రీ వేగంగా వృద్ధి చెందుతుంది.
Aryan Khan: డ్రగ్స్ కేసు.. ఆర్యన్ ఖాన్‌కు క్లీన్‌చిట్
డ్రోన్ల వినియోగం, తయారీలో 2030కల్లా భారత్ గ్లోబల్ డ్రోన్ హబ్‌గా మారుతుంది. టెక్నాలజీ వినియోగించడం ద్వారా సుపరిపాలన సాధ్యమవుతుంది’’ అని మోదీ అన్నారు. ‘భారత్ డ్రోన్ మహోత్సవ్-2022’ దేశంలో జరుగుతున్న అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్. రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో దాదాపు 1,600 మంది ప్రతినిధులు పాల్గొంటారు. 150 రిమోట్ పైలట్ సర్టిఫికెట్‌లను కూడా మోదీ ప్రారంభించారు.