T20 World Cup 2022: అర్ధసెంచరీలు బాదిన కేఎల్ రాహుల్, సూర్య కుమార్.. జింబాబ్వే లక్ష్యం 187

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో జింబాబ్వేకు టీమిండియా 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించి 3 సిక్సులు, 4 ఫోర్ల సాయంతో 34 బంతుల్లో 51 పరుగులు తీశాడు.

T20 World Cup 2022: అర్ధసెంచరీలు బాదిన కేఎల్ రాహుల్, సూర్య కుమార్.. జింబాబ్వే లక్ష్యం 187

Updated On : November 6, 2022 / 3:16 PM IST

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో జింబాబ్వేకు టీమిండియా 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించి 3 సిక్సులు, 4 ఫోర్ల సాయంతో 34 బంతుల్లో 51 పరుగులు తీశాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ 15, విరాట్ కోహ్లీ 26, సూర్యకుమార్ యాదవ్ 61 (నాటౌట్- 4 సిక్సులు, 6 ఫోర్లు) , రిషబ్ పంత్ 3, హార్దిక్ పాండ్యా 18, అక్షర్ పటేల్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో భారత్ కు 12 పరుగులు దక్కాయి. దీంతో 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ 2, బ్లెస్సింగ్ ముజారబానీ, సింకదర్ రజా చెరో వికెట్ తీశారు. టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్స్ కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియాకు గ్రూప్-బీలో 8 పాయింట్లు వస్తాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..