Tokyo Olympic Hockey : రసవత్తరంగా భారత్-బెల్జియం హాకీ సెమీస్ పోరు
టోక్యో ఒలింపిక్స్ లో భారత్-బెల్జియం హాకీ సెమీస్ పోరు రసవత్తరంగా సాగుతోంది. తొలి క్వార్టర్స్ లో భారత్ దూకుడు కనబరిచింది.

Ihockey
Tokyo Olympic Hockey : టోక్యో ఒలింపిక్స్ లో భారత్-బెల్జియం హాకీ సెమీస్ పోరు రసవత్తరంగా సాగుతోంది. తొలి క్వార్టర్స్ లో భారత్ దూకుడు కనబరిచింది. 2-1 తేడాతో ఇండియా లీడ్ లో కొనసాగుతోంది. 41 ఏళ్లుగా ఊరిస్తున్న ఒలింపిక్ పథకాన్ని ఖాయం చేసుకునేందుకు భారత పురుషుల హాకీ శ్రమిస్తోంది.
1972 తర్వాత ఒలింపిక్స్ లో తొలిసారి సెమీ ఫైనల్ దశకు అర్హత సాధించిన భారత్ తన సత్తా చాటుతోంది. ప్రపంచ ర్యాకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో బెల్జియంపై దూకుడుగా ఆడుతోంది. ఏ క్షణంలో నిర్లక్ష్యం దరిచేరనీయకుండా అప్రమత్తంగా ఆడితే గనుక భారత్ విజయం దక్కడం ఖాయం.
2019లో యూరప్ పర్యటనలో బెల్జియం జట్టుతో ఆడిన మూడు మ్యాచుల్లో భారత్ నే విజయం వరించింది. ఈ మ్యాచ్ లో నెగ్గితే ఫైనల్ చేరితే కనుక భారత్ కు స్వర్ణం లేదా రజతం ఖరారు అవుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడి అందులో గెలవాల్సి ఉంటుంది.
ఇప్పటికైతే భారత్ హాకీ జట్టు దూకుడుగా ఆడుతోంది. సెమీస్ గెలిస్తే భారత్ సంచలనమే. తొలి క్వార్టర్ లో 2 వ నిమిషంలో బెల్జియం గోల్ చేసింది. ఏడో నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ తొలి గోల్ చేశారు. ఎనిమిదో నిమిషంలో మన్ దీప్ సింగ్ రెండో గోల్ చేశారు.