వేదా పరిజ్ఞానం, విజ్ఞానం ఆధారంగా భారతీయ కొత్త విద్యా విధానమన్న మంత్రి… ఏకిపారేసిన నెటిజన్లు

  • Published By: srihari ,Published On : May 10, 2020 / 12:05 PM IST
వేదా పరిజ్ఞానం, విజ్ఞానం ఆధారంగా భారతీయ కొత్త విద్యా విధానమన్న మంత్రి… ఏకిపారేసిన నెటిజన్లు

Updated On : May 10, 2020 / 12:05 PM IST

రానున్న రోజుల్లో దేశంలో కొత్త విద్యా విధానం అమల్లోకి రానుంది. ఈ కొత్త విద్యా విధానమంతా వేదా పరిజ్ఞానం, విజ్ఞానం (సైన్స్) ఆధారంగా ఉంటుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ రమేశ్  పొఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. మహామన మాలావియా మిషన్, బనరస్ హిందు యూనివర్శిటీ (BHU) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కొవిడ్-19 మహామన భారతయీ విజన్’ అనే కార్యక్రమాన్ని మూడు రోజుల వెబినర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రమేశ్ మాట్లాడుతూ.. ‘ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందన్నారు. ప్రస్తుతం మహామన ఆలోచనలు కచ్చితంగా మనకెంతో చాలా ముఖ్యమనవి. 

మన సాంస్కృతిక వారసత్వమే మన బలం’ అన్నారు. మహామన విజన్ ఆధారంగా కొత్త విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకోస్తున్నామని చెప్పారు. ఇందులో వేదాలపై పరిజ్ఞానం, సైన్స్ విజ్ఞానానికి సంబంధించిన అంశాలు ఉంటాయన్నారు. మహామన ఆశయ సాధన నిజం కాబోతున్నట్టు తెలిపారు. ప్రతి క్రమశిక్షణలో ప్రాచీన జ్ఞానం ఒక భాగమై ఉండాలని ఆకాంక్షించారు. వెబ్‌నార్ ప్రారంభ సమావేశాన్ని ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ సుమన్ జైన్ నిర్వహించారు. 

ఈ వెబ్‌నార్ కార్యక్రమంలో 2000 మందికి పైగా పాల్గొన్నారు. గతంలో, ఉత్తరాఖండ్ మాజీ సీఎం అయిన రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ కూడా ఒక పురాతన సేజ్ కనడ్ క్రీ.పూ రెండవ శతాబ్దంలో అణు పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మంత్రి రమేశ్ వెబ్‌నర్‌లో చెప్పిన అంశాలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.