Indore : వేడిని తట్టుకునేందుకు దారిపొడవునా కూలర్లు అమర్చి పెళ్లి ఊరేగింపు.. ఇండోర్లో వైరల్ అవుతున్న వీడియో
ఓ వైపు ఎండ తీవ్రత ఇంకా తగ్గట్లేదు. మరోవైపు పెళ్లిళ్లు ఊపందుకున్నాయి. ఉక్కపోతలో పెళ్లి ఊరేగింపులో పాల్గొనాలి అంటే ఎవరికైనా ఇబ్బందే. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ఇండోర్లో ఓ పెళ్లివారికి వచ్చిన ఐడియాని మెచ్చుకుని తీరాల్సిందే.

Indore
Indore : వేసవికాలం వెళ్లిపోయినా ఇంకా ఎండల ప్రతాపం తగ్గలేదు. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు జనం గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ఆషాఢం దగ్గరపడుతుండటంతో పెళ్లిళ్లు ఊపందుకున్నాయి. ఓ వైపు ఉక్కపోత ఇబ్బంది పెడుతున్నా ఓ పెళ్లి ఊరేగింపులో జనం ఎలా సందడి చేశారో చూస్తే ఔరా అంటారు.
ఇండియన్స్ ఎలాంటి పరిస్థితుల్ని అయినా అధిగమిస్తారు అనడానికి నిదర్శనంగా ఉంది ఇప్పుడు చెప్పబోయే విషయం. ఓ వైపు ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. మరోవైపు జోరుగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వేడుకలో జరిగే ఊరేగింపుకి బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. మరి వేడి నుంచి తట్టుకుని పెళ్లి సంబరం సంతోషంగా జరుపుకోవడం ఎలానో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకను చూస్తే అర్ధమవుతుంది. పెళ్లివారు వేడిని తట్టుకోవడానికి ఊరేగింపుగా వెళ్లి మార్గం 1.5 కి.మీ పొడవునా కూలర్లు ఏర్పాటు చేశారు. ఈ కూలర్లు ట్రాలీలో ఉంచిన జనరేటర్లకు తెలివిగా కనెక్ట్ చేశారు.
Brawl Over DJ: డీజే విషయంలో గొడవ.. పెళ్లి బృందంపై హోటల్ సిబ్బంది దాడి.. వీడియో వైరల్
ఇక చల్ల చల్లగా గాలి వీస్తుంటే పెళ్లికి వచ్చిన అతిథులు పెళ్లి సంబరాలు సంతోషంగా జరుపుకున్నారు. @Anurag_Dwary అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘వాట్ యాన్ ఐడియా సర్ జీ’ అని.. ‘ఈ వీడియోను మెచ్చుకోకుండా ఉండకండి’ అంటూ కామెంట్లు చేశారు. ఏదైనా సమస్యకు సొల్యూషన్ కనిపెట్టడంలో భారతీయుల తర్వాతే ఎవరైనా అంటూ అందరూ కితాబు ఇస్తున్నారు.
गर्मी में बारातियों का जोश कूल रहे इसलिये इंदौर में 400 बारातियों के लिये 1.5 किमी. के रास्ते में कूलर लगाये गये 🙂 pic.twitter.com/LNacpTdHrL
— Anurag Dwary (@Anurag_Dwary) June 15, 2023