IT Raids In Minister Mallareddy : ఐటీ అధికారులు వేటకుక్కల్లా దాడులకు దిగారు : మల్లారెడ్డి అల్లుడు
టర్కీ నుంచి ఈరోజే హైదరాబాద్ కు చేరుకున్న మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఐటీ శాఖ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వేటకుక్కల్లా ఐటీ అధికారులు దాడులకు దిగారని..ఢిల్లీ పెద్దలు చెప్పినట్లుగానే ఐటీ అధికారులు ఈ దాడులకు పాల్పడ్డారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Minister Malla Reddy's son-in-law's reaction on IT Raids
IT Raids In Minister Mallareddy : టర్కీ నుంచి ఈరోజే హైదరాబాద్ కు చేరుకున్న మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఐటీ శాఖ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వేటకుక్కల్లా ఐటీ అధికారులు దాడులకు దిగారని..ఢిల్లీ పెద్దలు చెప్పినట్లుగానే ఐటీ అధికారులు ఈ దాడులకు పాల్పడ్డారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో ఆడవారిపై దురుసుగా వ్యవహరించారని మా తల్లి దండ్రులు, పిల్లల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని ఈ దాడులకు ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కారణమంటూ ఆరోపించారు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా..ఎంత దారుణంగా వ్యవహరించినా ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీదే విజయం అన్నారు మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి.
పార్టీ మారాలనే ఒత్తిడితోనే ఐటీ దాడులు చేయిస్తున్నారని కానీ తాము మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దాడులకు భయపడి పార్టీ మారతామని బీజేపీ అనుకుంటోందని కానీ వారి పాచికలు పారవు అంటూ చెప్పుకొచ్చారు.ఐటీ అధికారులు గవర్నమెంట్ ఉద్యోగుల్లా వ్యవహరించకుండా కక్ష పూరితంగా వ్యవహరించారంటూ మల్లారెడ్డి ఆరోపించారు. నా కుమారిడితో బలవంతంగా సంతకాలు తీసుకున్నారన్నారు. కానీ మల్లా రెడ్డి నివాసాలతో పాటు వారి కుమారులు, అల్లుడు, బంధువుల ఇళ్లపై వరుసగా రెండు రోజుల పాటు తనీఖీలు చేపట్టిన అధికారులు భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ దాడులు ఇక్కడితో ఆగవని మరోసారి జరుగుతాయని సమాచారం. ఈ దాడులకు పార్ట్ 1 కాదు పార్ట్ 2 కూడా ఉందని తెలుస్తోంది.