Son of India : ‘జయ జయ మహావీర’ గద్యాన్ని విడుదల చేసిన బిగ్‌‌బి..

‘జయ జయ మహావీర’ అనే పల్లవితో సాగే ఈ పాటని ఆలిండియా సూపర్‌ స్టార్‌, బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ విడుదల చేయడం విశేషం..

Son of India : ‘జయ జయ మహావీర’ గద్యాన్ని విడుదల చేసిన బిగ్‌‌బి..

Son Of India

Updated On : June 15, 2021 / 5:39 PM IST

Son of India: కలెక్షన్‌ కింగ్‌ డా. మంచు మోహన్‌బాబు హీరోగా డైమండ్‌ రత్నబాబు నిర్దేశకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫిల్మ్స్ బ్యానర్‌తో కలసి విష్ణు మంచు సంయుక్తంగా నిర్మిస్తున్న సంచలనాత్మక చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ లోని తొలి లిరికల్‌ వీడియో జూన్‌ 15వ తేదీన విడుదలైంది. ‘జయ జయ మహావీర’ అనే పల్లవితో సాగే ఈ పాటని ఆలిండియా సూపర్‌ స్టార్‌, బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ విడుదల చేయడం విశేషం.

Son of India : మెగాస్టార్ వాయిస్‌తో మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ టీజర్..

డాక్టర్‌ మోహన్‌ బాబుపైన అత్యంత ఉద్విగ్నభరితంగా చిత్రీకరించబడిన గీతానికి ఇళయరాజా అందించిన రసవత్తరమైన ట్యూన్‌ చాలా టచ్చింగ్‌గా ఉంది. ‘జయ జయ మహావీర’ పాటను విడుదల చేసిన బిగ్‌‌ బి అమితాబ్‌ తన ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా ట్వీట్‌ చేస్తూ భారతీయ సినీ చరిత్రలో దిగ్గజాల వంటి హీరో మోహన్‌ బాబు, సంగీత దర్శకుడు ఇళయరాజా సంయుక్తంగా భగవంతుడు శ్రీరామచంద్రుడి ఘనతకు నివాళులర్పించే రఘువీర గద్యాన్ని అద్భుతంగా సమర్పించారని అభినందనలు తెలియజేశారు.

అఖిల భారతస్థాయిలో అత్యున్నత స్థాయి కథానాయకుడైన అమితాబ్‌, డాక్టర్ మోహన్‌ బాబు చిత్ర గీతాన్ని విడుదల చేయడం ఒక సంచలనమైతే, వ్యక్తిగతంగా ట్వీట్‌ చేసి అభినందనలు, శుబాకాంక్షలు తెలియజేయడం మరో ప్రత్యేక ఆకర్షణగా అందరి దృష్టిని ఆకట్టుకుంది. దీనికి ముందు మెగాస్టార్‌ చిరంజీవి వ్యాఖ్యానంతో విడుదలైన టీజర్‌ కూడా సోషల్‌మీడియాని కుదిపేసింది. ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్ర కథానాయకుడిగా డాక్టర్‌ మోహన్‌ బాబు అదనంగా చిత్రానికి స్క్రీన్‌ప్లే బాధ్యతను కూడా నిర్వహించారు. ప్రముఖ తారాగణమంతా ప్రధాన పాత్రలు పోషించిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రం డాక్టర్‌ మోహన్‌ బాబు మార్కు డైలాగులు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌, ఊహించని మలుపులతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తుది మెరుగులు దిద్దుకుంటోంది.