Son of India : మెగాస్టార్ వాయిస్‌తో మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ టీజర్..

విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్.. డా. మంచు మోహన్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం.. ‘సన్నాఫ్ ఇండియా’..

Son of India : మెగాస్టార్ వాయిస్‌తో మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ టీజర్..

Son Of India

Son of India: విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్.. డా. మంచు మోహన్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం.. ‘సన్నాఫ్ ఇండియా’.. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో ఖాధీ వస్త్రాలు, మెడలో రుద్రాక్షమాలతో మోహన్ బాబు లుక్ డైనమిక్‌గా, గంభీరంగా ఉండడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచింది..

శుక్రవారం ఈ మూవీ టీజర్ తమిళ స్టార్ సూర్య రిలీజ్ చేశారు. మోహన్ బాబు మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో సాగిన ‘సన్నాఫ్ ఇండియా’ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సమర్పణలో, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద యంగ్ హీరో మంచు విష్ణు నిర్మిస్తున్నారు..

టీజర్‌లో మోహన్ బాబు క్యారెక్టర్‌ని పరిచయం చేశారు. ఆయన గెటప్ సింప్లీ సూపర్బ్.. తన స్టైల్ డైలాగ్స్‌తో అలరించారు మోహన్ బాబు.. ‘మ్యాస్ట్రో’ ఇళయరాజా సంగీతమందిస్తున్న ‘సన్నాఫ్ ఇండియా’ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, రఘబాబు, పృథ్వీ రాజ్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు..