కరోనా తగ్గిందని…ఊరేగింపుగా వెళ్లిన కార్పొరేటర్ అరెస్టు

  • Published By: madhu ,Published On : June 8, 2020 / 05:39 AM IST
కరోనా తగ్గిందని…ఊరేగింపుగా వెళ్లిన కార్పొరేటర్ అరెస్టు

Updated On : June 8, 2020 / 5:39 AM IST

కరోనా వ్యాధి తగ్గి భారీ ఊరేగింపుగా ఇంటికి వచ్చిన ఓ కార్పొరేటర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోవడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి. ఏం ఘనకార్యం చేశారని ఊరేగింపు చేస్తారు ? అందరికీ చెప్పాల్సిన ప్రజాప్రతినిధి ఈ విధంగా చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

JDS పార్టీకి చెందిన స్థానిక కార్పొరేటర్ ఇమ్రాన్ పాషాకు ఇటీవలే కరోనా వైరస్ సోకింది. దీంతో విక్టోరియా ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించారు. వైరస్ నుంచి బయటపడ్డారు. దీంతో ఆయన్ను ఇంటికి పంపించాలని వైద్యులు నిర్దారించారు. 2020, జులై 07వ తేదీ ఆదివారం డిశ్చార్జ్ చేశారు. ఇతను బయటకు రాగానే..వందలాది మంది ఆసుపత్రికి చేరుకున్నారు. పూలు చల్లారు..తెల్లటి కారులో ఆయన వెళుతుండగా..బైక్ లపై ఆయన అనచరులు ఫాలో అయ్యారు. మధ్యమధ్యలో బాంబులు పేల్చారు. ముందుకు వెళ్లాలంటే..కారుపై భాగం నుంచి కార్పొరేటర్ చెబుతుండడం వీడియోలో కనిపించింది. 

ఆయన నివాసం ఉండే ప్రాంతానికి భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. లాక్ డౌన్ నిబంధనలు పాటించరా ? అంటూ ప్రశ్నిస్తూ..కేసు నమోదు చేసి. అరెస్టు చేశారు. పోలీసుల చర్యను ఎమ్మెల్యే జమీర్ అమ్మద్ సమర్థించారు. అతను కోలుకోవడంతో సంతోషంగానే ఉందని..కానీ వ్యవహరించిన తీరు కరెక్టు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఇమ్రాన్ పాషాకు పాజిటివ్ వచ్చినప్పుడు ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా..వందలాది మంది వచ్చి..వీడ్కోలు పలకడం వివాదాస్పదమైంది. 
 

Read:  మాస్క్ లేకుండా బైటికొచ్చినందుకు తనకు తానే ఫైన్ వేసుకున్న పోలీస్ అధికారి