డ్యూటీలో ఇన్‌స్పెక్టర్‌ నిర్లక్ష్యం..వారం రోజులు రోడ్లు ఊడ్చాలని కోర్టు ఆర్డర్

డ్యూటీలో ఇన్‌స్పెక్టర్‌ నిర్లక్ష్యం..వారం రోజులు రోడ్లు ఊడ్చాలని కోర్టు ఆర్డర్

Updated On : December 26, 2020 / 11:23 AM IST

Karnataka High Court orders SHO to clean road : డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ కు కోర్టు షాక్ ఇచ్చింది. డ్యూటీలో ఉండి ఓ మహిళ న్యాయం కోసం వస్తే నిర్లక్ష్యం వహించిందుకు శిక్షవేసింది. వారం రోజుల పాటు చీపురు పట్టుకుని రోడ్లు ఊడ్చాలని ఆదేశించింది.

దీంతో సదరు ఇన్‌స్పెక్టర్‌ కు దిమ్మ తిరిగిపోయింది. గత గురువారం (డిసెంబర్ 24,2020)న కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో లాఠీ పట్టుకుని డ్యూటీ చేయాల్సిన ఆ ఇన్‌స్పెక్టర్‌ చీపురు పట్టుకుని రోడ్లు ఊడుస్తున్నారు. తను పనిచేసే పోలీసు స్టేషన్‌ ముందే వారం రోజుల పాటు చెత్త ఊడ్చాల ని ధర్మాసనం ఆదేశాలతో రోడ్లు ఊడుస్తున్నాడు ఆ పోలీస్.

కర్ణాటకలోని కలబురిగి జిల్లా మిణజగి తండాకు చెందిన కూలీ మహిళ తారాబాయి కుమారుడు సురేష్‌ అక్టోబరు 20న తప్పిపోయాడంటూ స్టేషన్‌బజార్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. సదరు ఇన్‌స్పెక్టర్‌ బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించకలేదు. పైగా..తప్పిపోయిన బాలుడి ఆచూకీ వెతికే ప్రయత్నం కూడా చేయలేదు.

దీంతో తారాబాయి కొడుకు కోసం అల్లాడిపోయింది. పోలీస్ స్టేషన్ లో ప్రజలు గోడు పట్టించుకోనందుకు ఆవేదన చెందింది. దీంతో తన కుమారుడిని వెతికి పెట్టాలంటూ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు ద్విసభ్యధర్మాసనం న్యాయమూర్తులు ఎస్‌. సునిల్‌దత్‌ యాదవ్‌, పీ. కృష్ణభట్‌ గురువారం సంచలన తీర్పునిచ్చారు.

సదరు బాధిత మహిళకు క్షమాపణ చెప్పాలని..కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. కోర్టు తీర్పును శిరసా వహిస్తానని సదురు ఇన్పెక్టర్ కోర్టుకు తెలియజేసి ధర్మాసనం ఆదేశాలు పాటిస్తున్నారు.