KathaKanchiki ManamIntiki : క్లైమాక్స్‌లో అదిత్ నటనకి థియేటర్‌లో ప్రేక్షకులు ఊగిపోతారు..
రుసగా మంచి చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేఖమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్న యంగ్ హీరో అదిత్ అరుణ్ హీరోగా, పూజిత పొన్నాడ జంటగా MP ఆర్ట్స్ బ్యానర్‌పై చాణక్య చిన్న దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘కథ కంచికి.. మనం ఇంటికి’..

Kathakanchiki Manamintiki First Look Motion Poster
KathaKanchiki ManamIntiki: వరుసగా మంచి చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేఖమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్న యంగ్ హీరో అదిత్ అరుణ్ హీరోగా, పూజిత పొన్నాడ జంటగా MP ఆర్ట్స్ బ్యానర్‌పై చాణక్య చిన్న దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘కథ కంచికి.. మనం ఇంటికి’.. ఈ చిత్రం టైటిల్ ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి సినిమా లవర్స్‌లో క్రేజ్ స్టార్టయ్యింది. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్నారు. హీరో అదిత్ అరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ఈ సందర్బంగా నిర్మాత మోనిష్ పత్తిపాటి మాట్లాడుతూ.. ‘‘కథ కంచికి.. మనం ఇంటికి’.. అనే ఒక అద్బుతమైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. పూర్తి వైవిధ్యంగా ఈ కథని దర్శకుడు చాణిక్య చిన్న మాకు చెప్పారు. ఆయన చెప్పినప్పుడే టైటిల్ అనుకున్నాం. మాకు చెప్పిన దానికంటే కూడా చాలా బాగా తెరకెక్కించాడు. అసలు ఈ కథకి హీరో ఎవరా అనుకున్నప్పుడు మా అందరి నోటా ఒకే మాట అదిత్ అరుణ్ అని.. ఆయన ఫర్ఫార్మెన్స్ మాత్రం ఈ సినిమాలో నెక్ట్స్ లెవెల్ అనే చెప్పాలి. ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రతి సినిమాకి కథకి తగ్గట్లు పాత్రలో ఒదిగిపోతాడు. ఈ సినిమాతో మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. క్లైమాక్స్‌లో అదిత్ నటనకి ప్రేక్షకులు థియేటర్‌లో ఊగిపోతారు, ఇది నిజం.. మా హీరో అదిత్ అరుణ్ పుట్టినరోజు సందర్భంగా మా మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాం. చాలా మంచి రెస్పాన్స్ రావడం మా యూనిట్‌కి ఆక్సిజన్ ఇచ్చింది. అలాగే మా హీరోకి బర్త్‌డే గిప్ట్ ఇది. హ్యపీ బర్త్‌డే టు అదిత్ అరుణ్’’ అన్నారు.