Keerthi Suresh: పాపం మహానటి.. మూడవ సినిమా కూడా ఓటీటీలోనేనా?

Keerthi Suresh: పాపం మహానటి.. మూడవ సినిమా కూడా ఓటీటీలోనేనా?

Keerthi Suresh Third Movie Is Also In The Ott

Updated On : June 7, 2021 / 8:35 AM IST

Keerthi Suresh: నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమా కీర్తి సురేష్ జీవితాన్నే మార్చేసింది. నటనలో సావిత్రితో పోల్చిన అతికొద్ది మంది నటీమణులలో కీర్తిని కూడా చేర్చారు. అంతకుమించి సావిత్రి పాత్రలోనే ఆమె ఒదిగిన తీరును మరింత ప్రశంసించారు. ఈ సినిమాతో కీర్తి దక్షణాదిలో స్టార్ హీరోలకు ఫెవరెట్ గా మారగా సోలో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కీర్తినే కేరాఫ్ గా మారింది. దీంతో ఒకవైపు స్టార్ హీరోలకు జోడీ కడుతూనే సోలో సినిమాలను చేసింది.

అయితే.. అలా చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కీర్తికి అంతగా కలిసి రాలేదు. కీర్తి ఇప్పటికే గత ఏడాది పెంగ్విన్ చేయగా.. ఆ తర్వాత మిస్ ఇండియా సినిమా చేసింది. ఇప్పటికే ఈ రెండు సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. కరోనా ప్రభావంతో గత ఏడాది ఫస్ట్ లాక్ డౌన్లో పెంగ్విన్ విడుదల కాగా ఆ తర్వాత మంచి రేటు దక్కడంతో మిస్ ఇండియాను కూడా ఓటీటీలోనే వచ్చేసింది. కానీ ఈ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.

కానీ ఇప్పుడు మరోసారి మూడవ సినిమా కూడా ఓటీటీలోనే రానుందని ప్రచారం జరుగుతుంది. కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా గుడ్ లక్ సఖి కూడా ఓటీటీలోనే విడుదల కాబోతోందని తెలుస్తుంది. త్వరలోనే జీ5లో ఈ సినిమా సందడి చేయబోతున్నట్లు సమాచారం. నాగేష్ కుక్కునూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్యమైన పాత్రలో నటించగా తమిళ, తెలుగు భాషలలో ఈ సినిమా తెరకెక్కింది. మరి ఈ సినిమాతో అయినా మహానటికి ఓటీటీ కలిసి వస్తుందా అన్నది చూడాల్సి ఉంది!