Kerala Idukki Dam: తమిళనాడు నుంచి భారీగా నీరు విడుదల..కేరళలోని ఇడుక్కి డ్యామ్ పై ఒత్తిడి..2 జిల్లాల్లో హై అలర్ట్

తమిళనాడు నుంచి భారీగా నీరు విడుదల చేయటంతో ..కేరళలోని ఇడుక్కి డ్యామ్ పై ఒత్తిడి పెరిగటంతో డ్యామ్ గేట్లను ఎత్తివేయాల్సి వచ్చింది. దీంతో కేరళలోని 2జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

Kerala Idukki Dam: తమిళనాడు నుంచి భారీగా నీరు విడుదల..కేరళలోని ఇడుక్కి డ్యామ్ పై ఒత్తిడి..2 జిల్లాల్లో హై అలర్ట్

Kerala Idukki Dam

Updated On : December 7, 2021 / 12:06 PM IST

Kerala Idukki Dam gates opened : కేరళలోని ఉడుక్కి డ్యామ్ లోకి భారీగా నీరు చేరింది. దీంతో అధికారులు నీరు బయటకు పంపించటానికి ఇడుక్కి డ్యామ్‌లోని గేట్లు ఎత్తి నీళ్లు కిందకు వదులుతున్నారు. రెండు గేట్లు ఎత్తి నీరు భారీగా బయటకు వదలటంతో ఇడుక్కి, పతనంతిట్ల జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. తమిళనాడులోని ముల్లపెరియార్ డ్యామ్ గేట్లు తెరియటంతో చర్యలు తీసుకోవటంతో ఆ నీరు ఇడుక్కి డ్యామ్ లోకి భారీగా వచ్చి చేరటంతో ఈ డ్యామ్ గేట్లు ఎత్తటం అనివార్యమైంది.

Read more : Prabhas: ఏపీ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించిన ప్రభాస్

ముల్లపెరియార్ డ్యామ్ నుంచి నీటి ప్రవాహం తర్వాత ఇడుక్కి డ్యామ్ లోకి భారీగా నీరు వచ్చి చేరటంతో డ్యామ్ ఒత్తిడి తగ్గించేందుకు కేరళ ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్ 7,2021) తెల్లవారుజామున ఇడుక్కిలోని చెరుతోని డ్యామ్ షట్టర్లను తెరిచింది. రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరుగుతున్న క్రమంలో తమిళనాడు ప్రభుత్వం సోమవారం రాత్రి గ్రాండ్ పాత ముల్లపెరియార్ డ్యామ్ తొమ్మిది గేట్లను తెరిచింది. మూడు నెలల్లో ఇడుక్కి డ్యామ్‌ గేట్లు నాలుగుసార్లు తెరవడం ఇదే తొలిసారి. ఈ నీరు వదలటంతో లోతట్టు ప్రాంతాల్లో నివసించే అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇడుక్కి, పతనంతిట్ట జిల్లాల్లో డ్యామ్ షట్టర్లను తెరవడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగడంతో హై అలర్ట్ ప్రకటించారు.

ముల్లపెరియార్ డ్యామ్ గేట్లను తిరిగి తెరిచినప్పటి నుండి కేరళ జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ ఆ ప్రాంతంలో క్యాంప్ చేస్తున్నారు. తమిళనాడు తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. తమిళనాడు రాత్రి సమయంలో డ్యామ్ గేట్లను తెరవడం ఇదే మొదటిసారి కాదు..ఇలా పలుమార్లు కేరళను తమిళనాడు ఇబ్బంది పెడుతోందని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బాధ్యతారాహిత్యం అని మంత్రి అగస్టిన్ అసహనం వ్యక్తంచేశారు.

Read more : AP High Court: సారీ సరిపోదు..వారం రోజులు వృద్ధులకు సేవ చేసి..వారి ఖర్చులు భరించాలి : అనంతపురం డీఈవోకు కోర్టు ఆదేశం

శతాబ్దాల చరిత్ర కలిగిన డ్యామ్ నీటిమట్టం సోమవారం 141.90 అడుగులకు చేరుకోవడంతో తమిళనాడు అధికారులు రాత్రి 7.45 గంటలకు తొమ్మిది గేట్లను 120 సెంటీమీటర్లకు పెంచారు. రాత్రి 10 గంటల తర్వాత మూడు గేట్లను మూసివేశారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలోని అధికారుల ప్రకారం..తమిళనాడు నీరు విడుదల చేయటంతో కేరళపై ఆ ప్రభావం పడింది. దీంతో కేరళ ప్రభుత్వం 100కు పైగా కుటుంబాలను ఇడుక్కి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.

కేరళలోని ఇడుక్కి జిల్లాలో పెరియార్ నదిపై 1895లో నిర్మించిన ముల్లపెరియార్ డ్యామ్, దాని నీటిపారుదల మరియు విద్యుత్ అవసరాల కోసం తమిళనాడు ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది. భద్రత దృష్ట్యా కొత్త డ్యామ్‌ను నిర్మించాలని కేరళ పట్టుబడుతోంది, అయితే ప్రస్తుతం ఉన్న నిర్మాణం బలంగా ఉందని తమిళనాడు వ్యతిరేకిస్తోంది.