KGF 2 : రాఖీ భాయ్ రఫ్ఫాడిస్తున్నాడు..

కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ అఖండ విజయం సాధించగా ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది..

KGF 2 : రాఖీ భాయ్ రఫ్ఫాడిస్తున్నాడు..

Kgf Chapter 2 Teaser Has Crossed 1 Million Comments On Youtube1

Updated On : June 2, 2021 / 10:50 AM IST

KGF 2: ‘రాకింగ్ స్టార్’ యష్ హీరోగా.. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘కె.జి.యఫ్’ చాప్టర్ 2.

కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ అఖండ విజయం సాధించగా ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే..

ఇప్పుడు ‘కె.జి.యఫ్ 2’ ట్రైలర్ ఏకంగా 1 మిలియన్ (పది లక్షలు) కామెంట్స్ దక్కించుకుంది.. ఇంత భారీ స్థాయిలో కామెంట్స్ రాబట్టి, యూట్యూబ్‌లో మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు రాఖీ భాయ్.. ఇప్పటివరకు 188 మిలియన్ల వ్యూస్, 8.3 మిలియన్ల లైక్స్‌తో ‘కె.జి.యఫ్’ చాప్టర్ 2 ట్రైలర్ ట్రెండ్ సెట్ చేసే దిశగా వెళ్తోంది..