‘క్రాక్’ కి బ్రేక్.. మొదటిరోజు ఆటలు రద్దు..

Krack First Day Shows: మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్ జంటగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘క్రాక్’.. ‘డాన్ శీను’, ‘బలుపు’ తర్వాత గోపిచంద్ మలినేని రవితేజ కలయికలో తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిల్మ్ ఇది.. జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేశారు కానీ ఇప్పటివరకు ఎక్కడా థియేటర్లో బొమ్మ పడలేదు.
https://10tv.in/krack-early-morning-shows-cancelled/
ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాని తమిళ్‌లో విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా విషయంలో మథుకి కోలీవుడ్ ఫైనాన్షియర్‌కి మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం కారణంగా ‘క్రాక్’ రిలీజ్‌కి అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొదటిరోజు అన్ని ఆటలు రద్దయ్యాయి. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.
ఇప్పటికే టికెట్ కొన్నవారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని థియేటర్ల యజమానులు చెప్పారు. రేపు ఉదయం 11గంటల నుంచి అన్ని ఏరియాల్లో షోస్ పడే అవకాశం ఉందని టాలీవుడ్ సమాచారం. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఫస్ట్ తెలుగు మూవీ ‘క్రాక్’ కావడంతో సినీ ప్రేమికులు ఫస్ట్ డే చూడాలనుకున్నారు. కట్ చేస్తే ఈ సినిమా ఎర్లీమార్నింగ్, మార్నింగ్ షోలతో పాటు ఫస్ట్‌డే షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి.