బాలీవుడ్‌లో కరోనా కలకలం..

  • Published By: sekhar ,Published On : December 8, 2020 / 01:18 PM IST
బాలీవుడ్‌లో కరోనా కలకలం..

Updated On : December 8, 2020 / 1:20 PM IST

Kriti Sanon tests positive for Covid-19: తగ్గుముఖం పట్టింది కదా అనుకుంటే మహమ్మారి కరోనా విజృంభణ మళ్లీ మొదలైంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌కు కరోనా సోకిందనే వార్త మర్చిపోకముందే హీరోయిన్ కృతిసనన్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది అని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.



ఆమె ప్రస్తుతం రాజ్‌కుమార్‌ రావ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది. ఇటీవల చంఢీఘర్‌లో ఈ సినిమా షూటింగ్‌ చేశారు. అక్కడి నుండి వచ్చిన తర్వాత కృతికి కోవిడ్‌ సోకిందట. అలాగే రిషి కపూర్ భార్య నీతూ కపూర్, నటుడు మనీష్ పాల్ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో వారు చికిత్స తీసుకుంటున్నారు.