Narne Nithiin : సంవత్సరం క్రితం నిశ్చితార్థం.. ఇప్పుడు పెళ్లి.. బామ్మర్ది పెళ్ళిలో ఎన్టీఆర్ సందడి.. వీడియోలు వైరల్..
గత నవంబర్ లో నిశ్చితార్థం చేసుకోగా ఈ జంట నేడు పెళ్లి చేసుకుంటుంది. (Narne Nithiin)

Narne Nithiin
Narne Nithiin : ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి సోదరుడు నార్నె నితిన్ హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మ్యాడ్, ఆయ్, మ్యాడ్ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు నార్నె నితిన్. గత సంవత్సరం నవంబర్ 3న నార్నె నితిన్ నిశ్చితార్థం చేసుకున్నాడు. హీరో దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీకి బంధువులు అయిన తాళ్లూరి వెంకట కృష్ణ ప్రసాద్, స్వరూప కూతురు అయిన శివాని తాళ్లూరిని ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ నిశ్చితార్థం చేసుకున్నాడు.(Narne Nithiin)
గత నవంబర్ లో నిశ్చితార్థం చేసుకోగా ఈ జంట నేడు పెళ్లి చేసుకుంటుంది. నార్నె నితిన్ – శివాని పెళ్లి వేడుక నేడు అక్టోబర్ 10న రాత్రి హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో ఘనంగా జరగనుంది. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.
Also Read : Yukti Thareja : కిరణ్ అబ్బవరం హీరోయిన్.. లవ్ స్టోరీ, బ్రేకప్, ఫస్ట్ కిస్.. ఇవన్నీ అప్పుడే అయిపోయాయి అంట..
బామ్మర్ది పెళ్ళికి ఎన్టీఆర్ కూడా హాజరయి సందడి చేశారు. బామ్మర్ది నార్నె నితిన్ పెళ్ళిలో ఎన్టీఆర్ సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పెళ్లి నుంచి కొన్ని వీడియోలు లీక్ అవ్వగా అధికారికంగా ఈ పెళ్లి ఫోటోలు, వీడియోలు ఎపుడు వస్తాయా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
#JrNTR from #NarneNithin‘s wedding !!
— Filmy Tollywood (@FilmyTwoodOffl) October 10, 2025
View this post on Instagram
Also See : Narne Nithiin Engagement Photos : ఎన్టీఆర్ బామ్మర్ది, హీరో నార్నె నితిన్ నిశ్చితార్థం ఫొటోలు..