Yukti Thareja : కిరణ్ అబ్బవరం హీరోయిన్.. లవ్ స్టోరీ, బ్రేకప్, ఫస్ట్ కిస్.. ఇవన్నీ అప్పుడే అయిపోయాయి అంట..

యుక్తి తరేజా ప్రస్తుతం K ర్యాంప్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.(Yukti Thareja)

Yukti Thareja : కిరణ్ అబ్బవరం హీరోయిన్.. లవ్ స్టోరీ, బ్రేకప్, ఫస్ట్ కిస్.. ఇవన్నీ అప్పుడే అయిపోయాయి అంట..

Yukti Thareja

Updated On : October 10, 2025 / 8:32 PM IST

Yukti Thareja : కిరణ్ అబ్బవరం త్వరలో K ర్యాంప్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. గతంలో యుక్తి తరేజా తెలుగులో రంగబలి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల మలయాళ సినిమా మార్కోతో హిట్ కొట్టింది. యుక్తి తరేజా ప్రస్తుతం K ర్యాంప్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.(Yukti Thareja)

తాజాగా ఓ ఇంటర్వ్యూలో యుక్తి తరేజా తన లవ్ స్టోరీ గురించి, తన ఫస్ట్ కిస్.. ఇవన్నీ ఇంటర్ ఏజ్ లోనే అయిపోయాయి అని చెప్పుకొచ్చింది.

Also Read : Neeraja Kona : తాతయ్య గవర్నర్.. నాన్న ఎమ్మెల్యే.. డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ కాస్ట్యూమ్ డిజైనర్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

యుక్తి తరేజా మాట్లాడుతూ.. 11వ తరగతిలో ఉన్నప్పుడు నా సీనియర్ ని ప్రేమించాను. కొన్నాళ్ల లవ్ తర్వాత అతను హైయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాడు. అప్పుడు మా లవ్ బ్రేకప్ అయింది అని తెలిపింది. అలాగే తన ఫస్ట్ కిస్ గురించి చెప్తూ.. 12 వ తరగతిలో నేను ఫస్ట్ టైం కిస్ చేశాను అని చెప్పింది.

అలాగే యుక్తి తరేజా తనకు కాబోయే అబ్బాయిలో క్వాలిటీస్ గురించి చెప్తూ.. పొడుగ్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నన్ను జడ్జ్ చేయకూడదు. నాతో ప్రేమగా ఉండాలి అని చెప్పుకొచ్చింది. ఇక యుక్తి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Yukti Thareja (@realyukti)

Also Read : Funky Teaser : విశ్వక్ సేన్ ‘ఫంకీ’ టీజర్ వచ్చేసింది.. అనుదీప్ మార్క్ ఫుల్ కామెడీ..