Viral Video: మీరు మారరా? మళ్లీ మీ బుద్ధి చూపించారుగా.. మెట్రోరైల్ స్టేషన్ల వద్ద గుట్కాలు ఉంచుతూ.. మొత్తం పాడుచేస్తూ..
సోషల్ మీడియాలో ఓ యువకుడు ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అవుతోంది.

Viral Video: బిహార్ రాజధాని పాట్నా వాసుల కలల బండి మెట్రో రైల్ తొలి దశ కారిడార్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మూడు రోజుల క్రితమే ప్రారంభించారు. ఆ తర్వాతి రోజు నుంచి దాని సర్వీసులు ప్రారంభమయ్యాయి. 3.45 కిలోమీటర్ల మేర సర్వీసులు అందుతున్నాయి.
పాటలిపుత్ర బస్ టెర్మినల్, జీరో మైల్, భూతనాథ్ అనే మూడు మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులు సర్వీసులు వాడుకోవచ్చు. అయితే, ప్రారంభించి మూడు రోజులైనా కాలేదు. చాలా మంది గుట్కావాలాలు తమ బుద్ధి చూపించారు. (Viral Video)
ఎంతో శుభ్రంగా ఉంచాల్సిన మెట్రో స్టేషన్ల వద్ద గుట్కాలు నమిలి ఉంచుతూ వెళ్తున్నారు. దీంతో అక్కడి పరిసరాలు ఎరుపు రంగులో కనపడుతున్నాయి. సోషల్ మీడియాలో ఓ యువకుడు ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అవుతోంది.
కొత్తగా ప్రారంభించిన మెట్రో స్టేషన్‌లో గోడలు, మెట్లు, ప్లాట్‌ఫామ్‌లు, రైలు పట్టాలు కూడా ఎర్రటి గుట్కా మరకలు పడ్డట్టు కనిపించాయి.
ఆ వీడియోలో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. “పాట్నా మెట్రో ప్రారంభమై 2-3 రోజులు కూడా కాలేదు. కానీ గుట్కా గ్యాంగ్ వచ్చేసింది. స్టేషన్, ప్లాట్‌ఫామ్ అంతా ఎర్రగా మార్చేశారు. కొంచెం సిగ్గు పడండి బిహార్ ప్రజలూ. ప్రభుత్వం ఎంతో మంచి పని చేస్తోంది.. మెట్రో నిర్మిస్తోంది. మీరు దాన్నే చెడగొడుతున్నారు” అని వ్యాఖ్యానించాడు.
View this post on Instagram