జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై బీజేపీలో మూడుముక్కలాట.. టికెట్ రేసులో ముగ్గురు.. వాళ్ల వెనుక మరో ముగ్గురు కీలక నేతలు
బొంతు రామ్మోహన్ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. టికెట్ ఇస్తామంటే ఆయన బీజేపీలోకి వస్తారని ఎంపీ అరవింద్ అంటున్నారట. ఇక దీపక్‌రెడ్డికి కిషన్‌రెడ్డి ఆశీస్సులు ఉన్నాయట.

Jubilee Hills Bypoll 2025: షెడ్యూల్ వచ్చేసింది. రెండ్రోజుల్లో నామినేషన్లు కూడా స్టార్ట్ కానున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ లేటెస్ట్‌గా క్యాండిడేట్‌ను అనౌన్స్ చేసి..గ్రౌండ్‌లోకి దిగేందుకు అస్త్రాలను రెడీ చేసుకుంటోంది. మరో ప్రధాన రాజకీయ పార్టీ అయిన బీజేపీ మాత్రం ఇప్పటికీ జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. బీజేపీలో ఎన్నికలు ఏవైనా అభ్యర్థి ఎంపిక అనేది చివరి క్షణం వరకు ఉత్కంఠగానే ఉంటుంది.
ఇప్పుడు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వరుస భేటీలు నిర్వహిస్తూ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు నేతలు. ఈ క్రమంలోనే ఆశావహులు ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ పేరును నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రతిపాదించారంట. గతంలో బొంతు రామ్మోహన్ ఏబీవీపీలో పనిచేశారని..మొన్నటి వరకు కాంగ్రెస్‌లో టికెట్ ఆశించి జూబ్లీహిల్స్‌లో కూడా పని చేశారని..ఆయనకు టికెట్ ఇస్తే పార్టీకి కలిసి వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ముందు అరవింద్ ప్రపోజల్ పెట్టారంట. (Jubilee Hills Bypoll 2025)
Also Read: రిజర్వేషన్ల కోటాపై సీఎం రేవంత్ ఊహించిందే జరిగిందా? ఆయనపై వారు ఒత్తిడి తెచ్చారా?
పార్టీ టికెట్ ఇస్తుందన్న భరోసా ఇస్తే రామ్మోహన్ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని అరవింద్ అంటున్నారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే బలమైన అభ్యర్థి ఉండాలని సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తేనే పార్టీ గెలుస్తుందని..రామ్మోహన్ అయితేనే బాగుంటుందని ఆయన సూచించారట. అయితే బీజేపీ అభ్యర్థిగా తన పేరు తెరమీదకు రావడం వెనుక తనకు ఎలాంటి సంబంధం లేదని బొంతు రామ్మోహన్ చెప్తున్నారు. అది వేరే విషయం అయినా..అరవింద్ బొంతు పేరును ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది.
ఇక లంకల దీపక్ రెడ్డి కిషన్ రెడ్డిని నమ్ముకుని జూబ్లీహిల్స్‌లో పనిచేసుకుంటూ పోతున్నారట. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండటంతో కిషన్‌రెడ్డి చెప్పిన వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో కిషన్ రెడ్డిపై భారం వేసి దీపక్‌రెడ్డి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట. 2023లో పోటీ చేసిన దీపక్ రెడ్డికి 25వేల పైచిలుకు ఓట్లు రాగా..ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 70 వేల ఓట్లు వచ్చాయని..ఈ సారి తనకు టికెట్ ఇస్తే పార్టీ గెలవడం పక్కా అన్న ధీమాతో ఆయన టికెట్ అడుగుతున్నారట.
పలువురు నేతల సపోర్ట్
దీపక్‌రెడ్డికి గతంలో టీడీపీలో కలిసి పనిచేసి ఇప్పుడు బీజేపీలో ఉన్న గరికపాటి రామ్మోహన్‌రావు, అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా సపోర్ట్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక పార్టీ సీనియర్ నేత ఆకుల విజయ కూడా టికెట్ కోరుతున్నారు. అటు బీసీ, ఇటు మహిళా కార్డును ఉపయోగిస్తూ తనకు టికెట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలన్నీ బీసీల చుట్టే తిరుగుతున్నాయని తనకు టికెట్ ఇస్తే పార్టీ బీసీలకు అవకాశం ఇచ్చిందని చెప్పుకునే వీలుంటుందని అంటున్నారట ఆకుల విజయ.
మరోవైపు ఆమె భర్త రెడ్డి సామాజికవర్గం కావడం కూడా కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. మరోవైపు లోకల్ నినాదాన్ని ఆమె తెరపైకి తెస్తున్నారు. గతంలో పార్టీ ఆదేశాలతో ఏకంగా కేసీఆర్, కేటీఆర్‌లపైనే పోటీ చేసిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేస్తున్నారు. అటు MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఢిల్లీలో బీజేపీ సంస్థాగత వ్యవహారాల చూసే మరో నేత..ఆకుల విజయకు టికెట్ దక్కేలా చక్రం తిప్పుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
బొంతు రామ్మోహన్ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. టికెట్ ఇస్తామంటే ఆయన బీజేపీలోకి వస్తారని ఎంపీ అరవింద్ అంటున్నారట. ఇక దీపక్‌రెడ్డికి కిషన్‌రెడ్డి ఆశీస్సులు ఉన్నాయట. ఆయన జూబ్లీహిల్స్ సీటు ఖాళీ అయినప్పటి నుంచి తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారట. ఇక ఆకుల విజయ బీసీ మహిళగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ..మందకృష్ణతో పాటు ఢిల్లీలోని పార్టీ సంస్థాగత వ్యవహారాలు చేసే నేత అండతో టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారట. ఈ ముగ్గురిలో టికెట్ ఎవరికి దక్కబోతోంది.? లేకపోతే మరో కొత్త నేతను తెరమీదకు తెస్తారా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.