Cough Syrup: దగ్గు సిరప్‌తో 20 మంది చిన్నారులు మృతి.. కేంద్రం కీలక ఆదేశాలు..

మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో కలుషితమైన దగ్గు సిరప్ సేవించి మూత్రపిండాల వైఫల్యంతో కనీసం 14 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో...

Cough Syrup: దగ్గు సిరప్‌తో 20 మంది చిన్నారులు మృతి.. కేంద్రం కీలక ఆదేశాలు..

Updated On : October 9, 2025 / 1:12 AM IST

Cough Syrup: దగ్గు సిరప్‌తో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో 20 మంది చిన్నారులు చనిపోయారు. గత 24 గంటల్లో నలుగురు మరణించారు. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రా మెటీరియల్స్‌‌, ఫైనల్ ప్రొడక్ట్స్‌ అన్నీ క్షుణ్ణంగా టెస్ట్ చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆదేశించింది. నాలుగేళ్లలోపు పిల్లలకు కోల్డ్, కాఫ్ సిరప్‌లు ఇవ్వొద్దని చెప్పినా విక్రయాలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

విషపూరిత దగ్గు సిరప్‌ల కారణంగా పలువురు పిల్లల మరణాల తర్వాత.. ముఖ్యంగా ముడి పదార్థాలు, తుది ఉత్పత్తులకు సంబంధించిన ఔషధ పరీక్ష నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

మధ్యప్రదేశ్‌లో పిల్లల ప్రాణాలను బలిగొన్న విషాద సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి ఔషధ తయారీదారులు ప్రతి బ్యాచ్ పదార్థాలను కఠినంగా పరీక్షించేలా చూసుకోవాలని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత డ్రగ్ కంట్రోలర్లను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆదేశించింది.

మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో కలుషితమైన దగ్గు సిరప్ సేవించి మూత్రపిండాల వైఫల్యంతో కనీసం 14 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో DCGI ఈ ఉత్తర్వు జారీ చేసింది.

అటు మధ్యప్రదేశ్ లో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ మరణాల సంఖ్య 20కి చేరింది. కలుషిత సిరప్ తాగి మరో ఐదుగురి కిడ్నీలు పాడైపోయాయి. మృతుల్లో చింద్వారాకు చెందిన వారే 17మంది ఉన్నారు. జ్వరం, జలుబు ఉన్న పిల్లలు సిరప్ తాగడంతో వాంతులు, మూత్ర విసర్జన సమస్యలు వంటి లక్షణాలు కనిపించాయి.