Ustaad Bhagat Singh : వామ్మో.. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అంత బ్యాలెన్స్ ఉందా? రిలీజ్ ఎప్పుడు మరి?
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎప్పుడో అనౌన్స్ చేశారు ఈ సినిమాని. (Ustaad Bhagat Singh)

Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ రాజకీయాలతో, ఉపముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నా కుదిరినప్పుడల్లా డేట్స్ ఇస్తూ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తిచేస్తున్నారు. ఈ క్రమంలో హరిహర వీరమల్లు,OG సినిమాలు పూర్తిచేసి రిలీజ్ చేశారు. ఇటీవల OG సినిమా రిలీజయి భారీ విజయం సాధించి ఏకంగా 310 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఈ ఇయర్ లో తెలుగు హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా నిలిచింది.(Ustaad Bhagat Singh)
OG సక్సెస్ తో ఆ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ కూడా చేస్తానని ప్రకటించాడు పవన్. ఆ సినిమాతో, పవన్ చెప్పిన మాటలతో, ప్రమోషన్స్ లో పవన్ హంగామాతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయ్యారు. ఇక పవన్ నుంచి మిగిలింది ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎప్పుడో అనౌన్స్ చేశారు ఈ సినిమాని. ఇన్నేళ్లు సాగి ఎట్టకేలకు ఇటీవల పవన్ కళ్యాణ్ పార్ట్ వరకు షూటింగ్ పూర్తయిందని మూవీ యూనిట్ ప్రకటించింది.
Also See : Allu Arjun : భార్యతో అల్లు అర్జున్ నెదర్లాండ్స్ వెకేషన్.. ఫోటోలు షేర్ చేసిన స్నేహా రెడ్డి..
అయితే తాజాగా మైత్రి నిర్మాత రవిశంకర్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారి పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఇంకా ఈ సినిమాకు 25 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. కొత్త షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ చేయలేదు అని తెలిపారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలానే బ్యాలెన్స్ ఉందని తెలుస్తుంది. టాలీవుడ్ టాక్ ప్రకారం ఈ సినిమాని 2026 సమ్మర్ కి తీసుకొస్తారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తమిళ్ తేరి సినిమా రీమేక్ అని గతంలో వార్తలు వచ్చాయి. అయితే హర్సిస్ శంకర్ అది కాదు, కథ మొత్తం మార్చేసాం అని అన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.