AP Cabinet Decisions: క్రికెటర్ శ్రీచరణికి 2.5 కోట్ల నగదు, 500 గజాల ఇంటి స్థలం.. గ్రూప్ 1 ఉద్యోగం..
ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు తెలిపారు.
Shree Charani
AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి వీటి వివరాలను మీడియాకు తెలిపారు.
పార్థసారథి తెలిపిన వివరాల ప్రకారం.. మహిళల ప్రపంచ కప్ గెలుపులో విశేష ప్రతిభ కనబర్చిన రాష్ట్ర క్రీడాకారిణి శ్రీ చరణికి ప్రోత్సాహకం ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.
శ్రీ చరణికి 2.5 కోట్ల నగదు, విశాఖ పట్నంలో 500 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
కాగా, డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలంలో స్పిన్నర్ శ్రీ చరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.30 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన వేలంలో ఆమె కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఆమె బేస్ ధర రూ.30 లక్షలు మాత్రమే.
మరోవైపు, కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన విషయంపై ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణపట్నం పోర్టులో 4,731 ఎకరాలు మల్టీ ప్రాడక్ట్ సెజ్ ఏర్పాటు కోసం 2010లో ల్యాండ్ కొనుక్కున్నారు. అక్టోబర్ 2019 లో గత ప్రభుత్వం ఈ భూ కేటాయింపులను రద్దు చేసింది.
దీన్ని కోర్టు కొట్టి వేయడం వల్ల, ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైనందున పెనాల్టీని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మూడేళ్లలో తొలిదశ ప్రాజెక్టును నిర్మాణాన్ని ప్రారంభించాలని సమయం ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
