Lockdown 4.0 : కటింగ్ షాపులకు గ్రీన్ సిగ్నల్, స్కూల్స్, థియేటర్స్ కు నో

  • Published By: madhu ,Published On : May 16, 2020 / 12:30 AM IST
Lockdown 4.0 : కటింగ్ షాపులకు గ్రీన్ సిగ్నల్, స్కూల్స్, థియేటర్స్ కు నో

Updated On : May 16, 2020 / 12:30 AM IST

కరోనా వైరస్ కారణంగా..భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. నిబంధనలు కొనసాగుతుండడంతో కొన్ని దుకాణాలకు ఇంకా తాళాలు వేలాడుతున్నాయి. ఇందులో కటింగ్ షాప్స్, సెలూన్లు కూడా ఉన్నాయి. దీంతో..చాలా మందికి గడ్డాలు, జుట్టు భారీగానే పెరిగిపోయింది. కొంతమంది అయితే..వారి వారి కుటుంబసభ్యులే..కటింగ్ చేశారు. దీనికి సంబంధించి..వీడియోలు..వైరల్ అయ్యాయి. 

భారతదేశంలో లాక్ డౌన్ ఇంకెన్ని రోజులు ఉంటుంది ? అనే ప్రశ్నకు సమాధానం లేదు. ప్రస్తుతం లాక్ డౌన్ 4.0లో ఎలాంటి సడలింపులు ఉంటాయి ? వేటికి అనుమతి ఉంటుంది ? అనే ఇతర ప్రశ్నలకు కొద్ది గంటల్లో సమాధానం రానుంది. కరోనా వైరస్ కారణంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసింది.

.ఇప్పటి వరకు మూడుసార్లు లాక్ డౌన్ కొనసాగించారు. 2020, మే 17వ తేదీ ఆదివారం వరకు నిబంధనలను కొనసాగనున్నాయి. కానీ లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడంతో ఎప్పటి వరకు ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

2020, మే 18వ తేదీ సోమవారం నుంచి ఎలాంటి నిబంధనలు వస్తాయనే దానిపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్ కార్యచరణపై 2020, మే 11వ తేదీన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. శుక్రవారం లోపుగా బ్లూ ప్రింట్స్ పంపించాలని సూచించారు. ఎలాంటి సూచనలు అందాయో తెలియరావడం లేదు. దీనిపై కేంద్రం స్టడీ చేసిన తర్వాత..ఫైనల్ గా నిర్ణయాన్ని వెలువడించనుంది. 

కానీ ఈసారి రాష్ట్రాలకు మరింత నిర్ణయాధికారాలను కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జోన్లు, హాట్ స్పాట్ నిర్ణయం రాష్ట్రాలకే వదిలేస్తారని తెలుస్తోంది. కంటైన మెంట్ జోన్లు మినహా…కటింగ్ షాపులు, సెలూన్లు, కొన్ని దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని సమాచారం. కానీ..పాఠశాలలు, సినిమా హాల్స్, మాల్స్ లకు ఎలాంటి పరిస్థితుల్లో అనుమతినివ్వరు.

రెడ్ జోన్లలోని కంటైన్ మెంట్ ప్రాంతాల్లో ఇంకా కఠినమైన ఆంక్షలు ఉండవచ్చునని, ఆరెంజ్, రెడ్ జోన్లలోని మార్కెట్ లు తెరిచే అవకాశాన్ని రాష్ట్రాలకు కట్టబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి కేంద్రం మరింత సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఎలాంటి సడలింపులు ఉంటాయో తెలుసుకోవడానికి మే 17వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.