International No Diet Day 2023 : డైట్ పాటించడం అంటే ఆహారం మానేయడం కాదు
అధిక బరువుతో బాధపడేవారు విపరీతంగా డైట్ చేస్తారు. నాజూగ్గా అవ్వాలని ఆరాటపడతారు. తినడం పూర్తిగా మానేస్తే నాజూగ్గా అవ్వడం మాట ఎలా ఉన్నా అనారోగ్యాల్ని కొని తెచ్చుకోవాలి. డైట్ పాటించకుండా జీవనశైలిని మార్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అధిక బరువు తగ్గుతారు. ఈరోజు ఇంటర్నేషనల్ నో డైట్ డే.

International No Diet Day
International No Diet Day 2023 : చాలామంది లావుగా ఉన్నామని అందువల్ల అందంగా కనిపించట్లేదని విపరీతంగా డైట్ చేస్తారు. దాని వల్ల అనారోగ్యాల బారిన పడతారు. డైట్ పాటించడం అంటే ఆహారం మానేయడం కాదు.. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్‌ని అలవర్చుకోవడం. ఈరోజు ఇంటర్నేషనల్ నో డైట్ డే.
బరువు సులభంగా తగ్గాలంటే మొక్కల అధారిత డైట్ మంచిదా?
డైటింగ్ అతిగా చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలపట్ల అవగాహన కల్పించేందుకే ఏటా మే 6న అంతర్జాతీయ నో డైట్ డే జరుపుతారు. 1992లో బ్రిటీష్ గ్రూప్ డైట్ బ్రేకర్స్ డైరెక్టర్ మేరీ ఎవాన్స్ ఈ డే అమలులోకి తెచ్చారట. అయితే అధికారికంగా ఏ ప్రత్యేక సంస్థతో అయితే ఇది స్ధాపించబడలేదు. ఆహారం మానేసి బరువు తగ్గడం కంటే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవడమే మంచిదనే అవగాహన కల్పించడం కోసమే ఈ దినోత్సవం జరుపుతారట. డైట్ పాటించకుండా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?
ఫుడ్ తింటున్నారా? తినే టైంలో మీకు నచ్చిన ఫుడ్‌ని ఆస్వాదిస్తూ తినండి. ఏదో ఆలోచిస్తూ ఫుడ్ తింటే ఎప్పుడూ తినే దానికంటే ఎక్కువ కేలరీలు తింటారని పరిశోధనలో తేలిందట. మీరు ఏమి తింటున్నారు? ఎప్పుడు తింటున్నారు? ఎంత తింటున్నారు.. ఇలా ట్రాక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు అతిగా తింటున్నామా? లేక ఆహారపు అలవాట్లు ఏమైనా మార్చులు చేసుకోవాలా? అనేది మీకే అర్ధం అయిపోతుంది.
నీరు ఎక్కువగా తాగాలి. అలా చేయడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అతిగా తినడం తగ్గిస్తాం. బాడీ హైడ్రేట్‌గా ఉంచడంతో ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా రోజుకి కనీసం 8 గ్లాసుల మంచినీరు తాగడం అలవాటు చేసుకోండి. నిద్ర అనేది చాలా అవసరం. నిద్ర సరిగా లేకపోతే జీర్ణక్రియ మొత్తం దెబ్బతింటుంది. రాత్రి నిద్ర బరువు తగ్గడంలో చాలా కీలకమనే విషయం మర్చిపోకూడదు. కాబట్టి రాత్రి కనీసం 7-8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలనే లక్ష్యం పెట్టుకోవాలి.
Stay Healthy : ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 డైట్ చిట్కాలను అనుసరించండి చాలు!
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్యాన్ని కాపాడటంలో వ్యాయామం ఎంతగానో సహాయపడుతుంది. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ లాంటివి కనీసం రోజుకు 30 నిముషాలు చేయడానికి ప్రయత్నించాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్ మాత్రమే తినాలి. చేపలు, లీన్ మాంసం, కూరగాయలు, పండ్లు, గింజలు, చిక్కుళ్లు ఇలాంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. తినేటప్పుడు కూడా చిన్న ప్లేట్లు, గిన్నెల వంటి వాటిలో తినడం వల్ల అతిగా తినడాన్ని కూడా తగ్గించవచ్చని పరిశోధనలో తేలిందట. ఎక్కువ మొత్తంలో మూడు సార్లు తినేకంటే చిన్న మొత్తంలో తరచుగా తినడం అనేది బరువును తగ్గించడానికి.. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుందట. ఇలాంటివి పాటిస్తూ అతిగా డైట్ చేయకుండానే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.