BJP MP : రూ.15 లక్షలలోపు అవినీతి చేసివాళ్లను వదిలేయండి…అంతకంటే ఎక్కువైతే నాకు చెప్పండి : బీజేపీ ఎంపీ
రూ.15 లక్షలలోపు అవినీతి చేసివాళ్లను వదిలేయండి...అంతకంటే ఎక్కువైతే నాకు చెప్పండి అంటూ ప్రజలకు హితబోధ చేసారు బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా.

Bjp Mp Janaradan Mishra Controversial Statement On Sarpanch Corruption
BJP MP Janaradan Mishra controversial statement on sarpanch corruption : రూ.15 లక్షలలోపు లంచం తీసుకుంటే అది పెద్ద విషయం కాదట..అంతకంటే ఎక్కువ లంచం అడిగితేనే తప్పట..బీజేపీ ఎంపీగారు ప్రజలకు చెబుతున్న మాటలివి. మధ్యప్రదేశ్ తన నియోజకవర్గంలోని రేవాలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా ప్రసంగిస్తు లంచం (అవినీతికి పాల్పడినా) ఎంత తీసుకోవచ్చు..ఎంత తీసుకోకూడదో చెప్పుకొచ్చారు.
Read more : Piyush Jain: పీయూష్ జైన్ అరెస్ట్.. రూ.284 కోట్ల నగదు, 250 Kg వెండి, 25 KGల గోల్డ్ సీజ్
ఎంపీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘మీ గ్రామ సర్పంచ్ రూ.15 లక్షలు గానీ..అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడినప్పుడు మాత్రమే నా వద్దకు రండి. అంతకు తక్కువగా ఉంటే దాని గురించి నాకు చెప్పొద్దు…మీరు కూడా పట్టించుకోవద్దు రూ.15 లక్షలలోపు అవినీతికి పాల్పడితే అతడిని వదిలేయండి అని చెప్పుకొచ్చారు.
Read more : Hetero Pharma : హెటిరో ఫార్మా కార్యాలయాల్లో ఐటీ సోదాలు
ఎందుకో దానికి వివరణ కూడా ఇచ్చారు ఎంపీగారు. ఎందుకంటేనంటే..సదరు ప్రెసిడెంట్ ఎన్నికల్లో రూ.7 లక్షలు ఖర్చు చేస్తేనే గెలిచాడు. మరోసారి గెలవాలంటే మరో రూ.7 లక్షలు అవసరమవుతాయి. ఇంకో లక్ష అంటారా దానికి అదనం. అందులో తప్పేమీ లేదు. అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడితే ఆ సర్పంచ్‌పై చర్యలు తీసుకుంటాం’ అని ఉచిత సలహా ఇచ్చారు బీజేపీ మంత్రి వర్యులు ఎంపీ జనార్దన్ మిశ్రా.
…When people accuse sarpanch of corruption, I jokingly tell them that if corruption is up to Rs 15 lakhs don't come to me…come only if it's (corruption) beyond Rs 15 lakhs: BJP MP Janaradan Mishra in Rewa, Madhya Pradesh (27.12) pic.twitter.com/ImobGWecBH
— ANI (@ANI) December 28, 2021