మిస్ ఇండియా రన్నరప్ : తల్లిదండ్రులతో కలిసి సన్మానానికి ఆటోలో వచ్చిన మాన్యాసింగ్

మిస్ ఇండియా రన్నరప్ : తల్లిదండ్రులతో కలిసి సన్మానానికి ఆటోలో వచ్చిన మాన్యాసింగ్

Updated On : February 17, 2021 / 4:49 PM IST

Manya Singh, Miss India 2020 runner-up : మాన్యాసింగ్.. విఎల్పి మిస్ ఇండియా పోటీలో రన్నరప్.. దేశవ్యాప్తంగా ఈమె పేరే వినిపిస్తోంది. పేదరికంలో పుట్టిన మాన్యాసింగ్ చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు పడింది. ఒక ఆటోరిక్షా డ్రైవర్ కూతురిగా మిస్ ఇండియా స్థాయికి ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. మిస్ ఇండియా 2020 పోటీలో రన్నరప్‌గా నిలిచిన మాన్యాసింగ్.. తన తల్లిదండ్రులతో కలిసి ఆటోలో వచ్చి ఆత్మీయ సత్కారం పొందింది. తాను చదివిన కాలేజీలోనే తనకు సత్కారం ఏర్పాటు చేయడంతో అక్కడికి తన తండ్రి నడిపే ఆటోలేనే చేరుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సన్మానాన్ని అందుకుంది. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యాసింగ్ తండ్రి ముంబైలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్నిపోషించుకుంటున్నాడు. కుమార్తె మాన్యాసింగ్ మిస్ ఇండియా కావాలనే కలలను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ వచ్చారు. అందాలపోటీలో పాల్గొంటానంటే ప్రోత్సహించారు. అలా మిస్ ఇండియా పోటీల్లో రెండోస్థానంలో నిలిచింది. మిస్ ఇండియా రన్నరప్‌గా గెలిచిన మాన్యాసింగ్.. ముంబైలోని ఆమె చదివిన కాలేజీ యాజమాన్యం.. సన్నానాన్ని ఏర్పాటు చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Femina Miss India (@missindiaorg)

ఈ సన్మానానికి ఆమె తన తండ్రి ఆటోలోనే వచ్చింది. కుమార్తెను చూసి గర్వంగా ఉందన ఓం ప్రకాశ్.. కూతురును ఆటోలో ఎక్కించుకుని కాలేజీ ప్రాంగాణమంతా చక్కర్లు కొట్టాడు. ఇదే కాలేజీలో నా కూతురుని నా ఆటోలో చాలాసార్లు దింపాను. కానీ ఇప్పుడు తీసుకొస్తుంటే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఇంతకన్నా ఆనందం నా జీవితంలో మరొకటి ఉండదని కన్నీటి పర్యంతమయ్యాడు. తన తల్లిదండ్రులు తన కోసం ఎంతో కష్టపడ్డారని తెలిపింది.