Medaram Jathara 2022: మహా వన జాతరలో తొలి ఘట్టం..కుంకుమ భరిణె రూపంలో సమక్క తల్లి ఆగమనం

20 ఏళ్ల తరువాత మేడారం జాతరలో అద్భుతం.20ఏళ్ల తరువాత మాఘశుద్ధ పౌర్ణమిరోజు మహాజాతర ప్రారంభమవడం ఇదేతొలిసారి. ఈక్రమంలో కుంకుమ భరిణె రూపంలో సమక్క తల్లి భక్తుల్ని కరుణించనుంది.

Medaram Jathara 2022: మహా వన జాతరలో తొలి ఘట్టం..కుంకుమ భరిణె రూపంలో సమక్క తల్లి ఆగమనం

Medaram Sammakka Entry Today

Updated On : February 17, 2022 / 1:24 PM IST

తెలంగాణ కుంభమేళా ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జన జాతర బుధవారం (ఫిబ్రవరి 16,2022)ఘనంగా ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో మేడారం అంత జనసంద్రంగా మారిపోయింది. భక్తులతో కిక్కిరిపోయింది మేడారం జాతర. ఆదివాసీల ఆచారాలతో నిండు పున్నమి వేళ బుధవారం (ఫిబ్రవరి 16,2022) రాత్రి 10.47 గంటలకు సారలమ్మ తల్లి(Saralamma) గద్దెపై కొలువైన ఘట్టం కనుల పండువగా సాగింది. మేడారం జాతరలోతొలిఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులందరికి కనువిందు చేయటానికి సారలమ్మ గద్దెలపైకి చేరుకుంది. కన్నెపల్లి నుంచి అమ్మ ప్రతిరూపాలుగా భావించే, పసుపు-కుంకుమల భరిణలను మేడారంకు తీసుకొచ్చి గద్దెపైన ప్రతిష్ఠించారు పూజారులు. సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన కన్నెపల్లి ఆడపడుచులు.. అమ్మలను ప్రతిష్ఠించే గద్దె వద్ద శుద్ధి కార్యక్రమాలు చేశారు. భక్తుల కోలాహలం మధ్య సారలమ్మను తీసుకొచ్చారు పూజారులు. అమ్మవారి రాకను చూసేందుకు, సారలమ్మకు ఆహ్వానం పలికేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. కనులపండువగా తిలకించారు.

కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క ఆగమనం..
గురువారం (ఫిబ్రవరి 17,2022) చిలకల గుట్టలో ఉన్న సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకు వస్తారు పూజారులు. సమ్మక్క తల్లికి ప్రభుత్వ లాంఛనాలతో ఆహ్వానం పలుకుతారు అధికారులు, మంత్రులు. తల్లి రాకకు గౌరవ సూచకంగా జిల్లా పోలీసు అధికారి గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి.. అమ్మకు గౌరవ వందనం సమర్పిస్తారు..

20ఏళ్ల తర్వాత మాఘశుద్ధ పౌర్ణమి రోజు..
అయితే ఈ ఏడా మరో ప్రత్యేకత ఉంది. రెండు దశాబ్దాల తర్వాత మేడారం జాతరలో అద్భుతం చోటు చేసుకుంది. గత రెండు దశాబ్దాలలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర ప్రారంభమవడం ఇదే తొలిసారి కావడం విశేషం. బుధవారం రోజున సమ్మక్క తల్లి కుంకుమ భరిణె రూపంలో దేవతగా అవతరించింది. అందుకే ఆదివాసీలు ఆ మాఘశుద్ధ పౌర్ణమి రోజును అత్యంత పవిత్రంగా భావిస్తారు. అదే రోజే జాతర ప్రారంభించడం చాలా సందర్భాల్లో వీలుకాదని సమ్మక్క ఆలయ పూజరి కొక్కెర రమేశ్‌ తెలిపారు.

ప్రతిసారి బుధవారం జాతర ప్రారంభించడం మేడారంలో ఆనవాయితీగా వస్తోంది. మాఘశుద్ధ పౌర్ణమి, బుధవారం ఒకే రోజు రావడం చాలా అరుదుగా జరుగుతుందని అన్నారు. గత ఏడాది జాతర ముగిసిన రోజు వచ్చిందని సమ్మక్క పూజారి కొక్కెర రమేశ్‌ తెలిపారు.