Mugguru Monagallu : ఫన్ రైడర్‌గా ‘ముగ్గురు మొనగాళ్లు’ ట్రైలర్..
ట్రైలర్‌లో శ్రీనివాస్‌రెడ్డి, దీక్షిత్ శెట్టి (కన్నడ హిట్ మూవీ ‘దియా’ ఫేమ్), వెన్నెల రామారావు కలిసి చేసే అల్లరి కడుపు చెక్కలయ్యేలా నవ్వించింది..

Mugguru Monagallu
Mugguru Monagallu: శ్రీనివాస్‌రెడ్డి, దీక్షిత్ శెట్టి (కన్నడ హిట్ మూవీ ‘దియా’ ఫేమ్), వెన్నెల రామారావు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్నఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మంగళవారం ‘ముగ్గురు మొనగాళ్లు’ ట్రైలర్ రిలీజ్ చేశారు..
2.15నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ నవ్వులు పూయించింది. శ్రీనివాసరెడ్డికి వినపడదు, దీక్షిత్ శెట్టి మాట్లాడలేడు, వెన్నెల రామారావుకు కనపడదు. ట్రైలర్‌లో వీరు ముగ్గురు కలిసి చేసే అల్లరి కడుపు చెక్కలయ్యేలా నవ్వించింది. ఇక అనుకోకుండా వరుస హత్యల కేసులో వీరు ముగ్గురు ఇరుక్కోవడం తర్వాత ఆ కేసుని వీళ్లు ఛేదించాలని నిర్ణయించుకోవడం లాంటి అంశాలు థ్రిల్లింగ్‌గా ఉండడంతో పాటు సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.
‘గరుడవేగ’ అంజి విజువల్స్, సురేష్ బొబ్బిలి సంగీతం, చిన్నా నేపథ్య సంగీతం ట్రైలర్‌ను మరో రేంజ్‌కి తీసుకెళ్లాయి. మొత్తానికి ఈ ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
నటీనటులు..
శ్రీనివాసరెడ్డి, దీక్షిత్ శెట్టి (‘దియా’ మూవీ హీరో), వెన్నెల రామారావు, రిత్విష్ శర్మ, శ్వేతా వర్మ, నిజర్, రాజా రవీంద్ర, జెమిని సురేష్, జోష్ రవి, భద్రం, సూర్య, జబర్థస్త్ సన్నీ..
సాంకేతిక నిపుణులు..
డైరెక్టర్: అభిలాష్ రెడ్డి
ప్రొడ్యూసర్: పి. అచ్యుత్‌రామారావు
కో ప్రొడ్యూసర్స్: తేజ చీపురుపల్లి, రవీందర్‌రెడ్డి అద్దుల
డీఓపీ: గరుడవేగ అంజి
మ్యూజిక్ డైరెక్టర్: సురేష్ బొబ్బిలి
బ్యాగ్రౌండ్ స్కోర్: చిన్నా
ఎడిటర్: బి. నాగేశ్వర రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: నాని..