అటు మహేష్, ఇటు పవన్.. కాపీ క్యాట్ అన్నోళ్లకు గట్టి సమాధానం చెప్పాడు
ఒకప్పుడు కాపీ క్యాట్ అన్నారు. అన్నీ ఎత్తేసిన పాటలే అన్నారు. అసలు సొంతంగా ఒక్క పాట కూడా కంపోజ్

ఒకప్పుడు కాపీ క్యాట్ అన్నారు. అన్నీ ఎత్తేసిన పాటలే అన్నారు. అసలు సొంతంగా ఒక్క పాట కూడా కంపోజ్
ఒకప్పుడు కాపీ క్యాట్ అన్నారు. అన్నీ ఎత్తేసిన పాటలే అన్నారు. అసలు సొంతంగా ఒక్క పాట కూడా కంపోజ్ చెయ్యలేడన్నారు. అన్నింటీకీ హిట్ సాంగ్స్ తోనే సమాధానం చెబుతున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో ప్రస్తుతం తెలుగులోనే కాదు సౌత్ లోనే చేతిలో ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. వరుస హిట్స్ తో టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ లో ఉన్నాడు తమన్.
6 నెలల్లో 20 కోట్ల వ్యూస్, వరల్డ్ బెస్ట్ 100 సాంగ్స్ లో 15 వ ప్లేస్:
అల వైకుంఠపురంలో బుట్ట బొమ్మా పాట 6 నెలల్లో 20 కోట్ల వ్యూస్ క్రాస్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా వరల్డ్ బెస్ట్ 100 సాంగ్స్ లో 15 వ ప్లేస్ కొట్టేసిన ఈ సాంగ్ వరల్డ్ రికార్డ్ తో టాలీవుడ్ లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన థమన్ ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్. అందుకే వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి తమన్ కు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన దేవిశ్రీ ప్రసాద్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా పక్కకు నెట్టేసి తమన్ వైపు చూస్తున్నారు మూవీ మేకర్స్. తమన్ కూడా మాస్, క్లాస్ బీట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
దేవీని కాదని తమన్ కు పవన్ చాన్స్:
లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాకు కూడా మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ కొట్టేశాడు థమన్. మహేష్ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పింక్ రీమేక్ మూవీకి కూడా తమన్ మ్యూజిక్ చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ చేసింది దేవిశ్రీ ప్రసాదే. పవర్ స్టార్ సినిమాలకు అదిరిపోయే ట్యూన్లిస్తుంటాడు దేవిశ్రీ. ఈసారి మాత్రం వకీల్ సాబ్ సినిమాకు దేవిని పక్కన పెట్టి తమన్ ను తీసుకున్నాడు పవర్ స్టార్. థమన్ హిట్ ఫామ్ ని చూసి తన సినిమాకు ఫస్ట్ టైమ్ సినిమాకు ఛాన్సిచ్చారు పవన్ కళ్యాణ్.
6 సినిమాలతో ఫుల్ ఫామ్:
ఈ ఏడాది ఇప్పటికే మ్యూజిక్ సెన్సేషనల్ క్రియేట్ చేసిన తమన్.. మరో ఆరు సినిమాలతో ఫుల్ ఫామ్ ను మెంటేన్ చేస్తున్నాడు. పవర్ స్టార్.. సూపర్ స్టార్ సినిమాలతో పాటు.. మాస్ మహరాజ్ క్రాక్ మూవీకి.. సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరు, నానీ కొత్త సినిమా టక్ జగదీష్, కీర్తీ సురేష్ మిస్ ఇండియా.. సినిమాలకు తన స్వరాలందిస్తున్నాడు తమన్.
సౌత్ నాలుగు భాషల్లో బిజీబిజీ:
టాలీవుడ్ తో పాటు సౌత్ నాలుగు భాషల్లో బిజీగా ఉన్నాడు తమన్. ఇటు తెలుగులో ఇన్ని సినిమాలు చేస్తూనే.. సౌత్ అన్ని భాషల ఆడియన్స్ మర్చిపోకుండా.. తమిళంలో.. మలయాళంలో..కన్నడ లో ఒక్కో సినిమా చేస్తున్నాడు మ్యూజిక్ మెజీషియన్. ఇప్పుడు దేవీశ్రీ ప్రసాద్ కంటే ఎక్కువ సినిమాలు చేతిలో పెట్టుకుని తీరిక లేకుండా తనకొస్తున్న వరుస అవకాశాలు అందింపుచ్చుకుంటున్నాడు తమన్.