Naga Chaitanya: స్పీడ్ పెంచిన చైతూ.. ఈ ఏడాది మూడు సినిమాలు?
సాధారణంగానే ఇప్పుడున్న హీరోలు ఏడాదికి రెండో సినిమా చేయడం అంటేనే ఘనంగా భావించాలి. అలాంటిది ఇప్పుడు అసలే కరోనా కాలం. సినిమా షూటింగ్ చేయడమే కానాకష్టంగా మారగా ఒకవేళ షూటింగ్ పూర్తిచేసినా థియేటర్స్ కు రావడం ఇంకా గగనమైంది.

Speed increased Naga Chaitanya Three Movies Released This Year
Naga Chaitanya: సాధారణంగానే ఇప్పుడున్న హీరోలు ఏడాదికి రెండో సినిమా చేయడం అంటేనే ఘనంగా భావించాలి. అలాంటిది ఇప్పుడు అసలే కరోనా కాలం. సినిమా షూటింగ్ చేయడమే కానాకష్టంగా మారగా ఒకవేళ షూటింగ్ పూర్తిచేసినా థియేటర్స్ కు రావడం ఇంకా గగనమైంది. కరోనా మధ్యలో ఓ నాలుగు నెలలు కాస్త రిలీఫ్ ఇవ్వగా ఇప్పుడు మళ్ళీ రాబోయే అన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక షూటింగ్స్ కూడా దాదాపుగా అందరూ ప్యాకప్ చెప్పేశారు. ఇక మన తెలుగు విషయానికి వస్తే ఒక్క నాగచైతన్య సినిమా షూటింగ్ మాత్రం జరుగుతూనే ఉందట.
చైతూ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో ఒకటి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ కాగా.. హిందీలో ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘లాల్ సింగ్ చద్దా’ మరొకటి. ఇందులో చైతూ కథను మలుపుతిప్పే ఒక కీ రోల్ చేస్తున్నాడు. కరోనా టైంలో కూడా థాంక్యూ షూటింగ్ ఆపకుండా చేస్తున్నారట. ఎందుకంటే ఈ షూటింగ్ జరిగేది విదేశాలలో. కథాపరంగా విదేశాలలోనే నేపథ్యం కావడంతో షూటింగ్ అంతరాయం లేకుండాపోయింది.
ఇక, ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన లవ్ స్టోరీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అన్నీ కుదిరి విడుదల అనుకుంటుండగా కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. అసలే ఈ సినిమాలోని సాయిపల్లవి సారంగదరియా పాటతో సినిమా మీద మంచి అంచనాలే పెంచగా కరోనా ఎప్పుడు అవకాశం ఇస్తే ఈ సినిమా అప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. అదే పనిలో విక్రమ్ కుమార్ థాంక్యూ కూడా ఈ ఏడాదిలో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక అమిర్ ఖాన్ లాల్ సింగ్ కూడా కరోనా ఫ్రీ అయితే షూటింగ్ మొదలవుతుంది. మొత్తంగా ఈ ఏడాది చైతూ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని సన్నాహాలు చేస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు అనుకున్నట్లు జరుగుతుందో చూడాలి.
Read: MAHA Release controversy: తన సినిమా విడుదల ఆపాలని కేసుపెట్టిన దర్శకుడు!