Natural Star Nani : జున్నుతో ఆటలాడుతున్న నాని.. వీడియో వైరల్..

నేచురల్ స్టార్ నాని తన ముద్దుల కొడుకు జున్ను(అర్జున్) తో కలిసి సరదాగా గడిపే వీడియోలు ఇంతకుముందు సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లను ఆకట్టుకున్నాయి..

Natural Star Nani : జున్నుతో ఆటలాడుతున్న నాని.. వీడియో వైరల్..

Natural Star Nani Playing With His Son Arjun Junnu

Updated On : April 25, 2021 / 3:21 PM IST

Natural Star Nani: నేచురల్ స్టార్ నాని తన ముద్దుల కొడుకు జున్ను(అర్జున్) తో కలిసి సరదాగా గడిపే వీడియోలు ఇంతకుముందు సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లను ఆకట్టుకున్నాయి.. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ ఆపెయ్యడంతో నాని తన కొడుకుతో టైం స్పెండ్ చేస్తున్నారు..

జున్నుతో కలిసి దుప్పటి కప్పుకుని నాని పిల్లో, అర్జున్ టూత్ బ్రష్ పట్టుకుని షూట్ చేస్తూ గోల గోల చేశారు.. ఈ తతంగమంతా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు నాని.. నేచురల్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోదీ వీడియో.

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)

సినిమాల విషయానికొస్తే.. నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా.. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘టక్ జగదీష్’.. ఈ నెల 16న రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.

Tuck Jagadish

‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో, నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’ మూవీ షూటింగ్ దశలో ఉంది. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ‘అంటే సుందరానికీ..’ చిత్రంలో నాని, న‌జ్రియా న‌జీమ్‌తో కలిసి నటిస్తున్నారు..

Shyam Singha Roy