Presidential election: రేపు ఎన్డీఏ నేతల కీలక భేటీ
త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పలు అంశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్డీఏ నేతలు చర్చిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనాల్సిన తీరుపై తమ నేతలకు ఎన్డీఏ ముఖ్యనేతలు సూచనలు చేస్తారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నట్లు సమాచారం.

Modi Amit Shah
Presidential election: రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు రేపు సాయంత్రం ఎన్డీఏ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ కూటమిలోని పార్టీల కీలక నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఇప్పటికే ద్రౌపది ముర్ము, విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న జరగనుంది. ఈ నేపథ్యంలో మద్దతు కూడగట్టడానికి ఎన్డీఏ రేపు సమావేశం నిర్వహించనుంది.
Amalapuram: తోటి ఉద్యోగుల ముందే కుప్పకూలి.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
అలాగే, త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పలు అంశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్డీఏ నేతలు చర్చిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనాల్సిన తీరుపై తమ నేతలకు ఎన్డీఏ ముఖ్యనేతలు సూచనలు చేస్తారు. మాక్ డ్రిల్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన అనంతరం ఎన్డీఏ నేతలు విందు భోజనం చేస్తారు.