Netflix Basic Ads Subscription : నెట్‌ఫ్లిక్స్ బేసిక్ యాడ్ సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్.. నవంబర్ 3నే లాంచ్.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
Netflix Basic Ads Subscription : ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) బేసిక్ విత్ యాడ్స్ సబ్‌స్క్రిప్షన్‌ను నవంబర్ 3న ప్రారంభించనుంది. 720p లేదా HD వీడియో క్వాలిటీ సపోర్ట్‌తో అందించనుంది. తక్కువ-ధర యాడ్-సపోర్టు ప్లాన్ అని చెప్పవచ్చు.

Netflix Basic with Ads subscription will launch on November 3 Price and other details
Netflix Basic Ads Subscription : ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) బేసిక్ విత్ యాడ్స్ సబ్‌స్క్రిప్షన్‌ను నవంబర్ 3న ప్రారంభించనుంది. 720p లేదా HD వీడియో క్వాలిటీ సపోర్ట్‌తో అందించనుంది. తక్కువ-ధర యాడ్-సపోర్టు ప్లాన్ అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ ధర యూజర్లకు నెలకు 6.99 డాలర్లు (సుమారు రూ. 578) అవుతుంది. భారత మార్కెట్లో ఇదే ధర ఉండకపోవచ్చు. ఈ కొత్త బేసిక్ యాడ్ ప్లాన్ ద్వారా యూజర్లు ప్రస్తుత ప్లాన్‌లు ప్రభావితం కావని Netflix ధృవీకరించింది. ఇప్పటికే బేసిక్ ప్యాక్‌ని కలిగి ఉంది. యాడ్స్ నుంచి ఫ్రీగా ఎలాంటి అంతరాయం లేకుండా మొత్తం కంటెంట్‌ను ప్రీమియం ధర ట్యాగ్‌లతో స్టాండర్డ్, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లను అందిస్తుంది.
బేసిక్, కొత్త యాడ్ ప్లాన్ మధ్య తేడా ఏంటి? :
నెట్‌ఫ్లిక్స్ యూజర్లు గంటకు 4 నుంచి 5 నిమిషాల యాడ్స్ (సగటు) మాత్రమే చూస్తారని చెప్పవచ్చు. ఏదైనా సినిమా చూసే ముందు యూజర్లు 15 లేదా 30 సెకన్ల యాడ్స్ పొందవచ్చు. నెట్‌ఫ్లిక్స్ ప్రకారం.. కొత్త ప్లాన్ టైటిల్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు లైసెన్స్ పరిమితుల కారణంగా పరిమిత సంఖ్యలో మూవీలు/టీవీ షోలు ప్రారంభంలో అందుబాటులో ఉండవు. ప్రారంభంలో కొన్ని దేశాలు మాత్రమే లేటెస్ట్ ప్లాన్‌ను అందిస్తాయని కంపెనీ ధృవీకరించింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కొరియా, మెక్సికో, స్పెయిన్, యూకే, అమెరికా ఉన్నాయి.

Netflix Basic with Ads subscription will launch on November 3 Price and other details
నెట్‌ఫ్లిక్స్ బేసిక్ విత్ యాడ్స్ సబ్‌స్క్రిప్షన్ : ఇండియాకు ఎప్పుడు వస్తుంది? :
నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్‌ను కేవలం 12 దేశాల్లో మాత్రమే లాంచ్ చేస్తోంది. ఆ లిస్టులో భారత్ లేదు. ఈ ప్లాన్ కాలక్రమేణా మరిన్ని దేశాలకు నెట్‌ఫ్లిక్స్ అధికారిక బ్లాగ్ చెబుతోంది. భారతీయులు భవిష్యత్తులో ఈ నెట్‌ఫ్లిక్స్ బేసిక్‌ని యాడ్స్ సబ్‌స్క్రిప్షన్‌తో చూసే అవకాశాలు ఉన్నాయి.
భారత్‌లో ధర ఎంత ఉండొచ్చు? :
నెట్‌ఫ్లిక్స్ అధికారిక వివరాలు అందుబాటులో లేవు. కానీ, ఈ ప్లాన్‌ను ప్రస్తుత ప్లాన్‌ల కన్నా తక్కువకు లాంచ్ చేయాలని భావిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్రస్తుతం కంపెనీ నుంచి చౌకైనది. దీని ధర రూ. 149. Netflix భారత్‌లో కూడా బేసిక్ విత్ యాడ్స్ ప్లాన్‌ను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తుంటే.. ధర దీని కన్నా తక్కువగా ఉంటుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..