New Pairs : కొత్త జంట అదుర్స్..
స్క్రీన్‌కి అందమైనా, సినిమాకి ఎట్రాక్షన్ అయినా.. హీరోయినే.. అందుకే హీరోలకు జంటల్ని ఆచితూచి మరీ సెలెక్ట్ చేస్తారు మన మేకర్స్..

New Pairs
New Pairs: స్క్రీన్‌కి అందమైనా, సినిమాకి ఎట్రాక్షన్ అయినా.. హీరోయినే.. అందుకే హీరోలకు జంటల్ని ఆచితూచి మరీ సెలెక్ట్ చేస్తారు మన మేకర్స్. రెగ్యులర్ రొటీన్ రిపీట్ కాంబినేషన్స్‌ని సెలెక్ట్ చెయ్యకుండా.. సరికొత్త జంటల్ని సెలెక్ట్ చేసి మార్కులు కొట్టేస్తారు మేకర్స్.. అందుకే చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలు కూడా కొత్త జంటల్ని వెతుక్కునే పనిలో పడ్డారు.
టాలీవుడ్ స్క్రీన్ మీద కొత్త జంటలు సందడి చెయ్యబోతున్నాయి. ఇప్పటి వరకూ చూసిన రొటీన్ కాంబినేషన్స్ కాకుండా ఈసారి సరికొత్త కెమిస్ట్రీని ఆడియెన్స్‌కి చూపించబోతున్నారు. లేటెస్ట్‌గా చిరంజీవి సినిమాకు కొత్త హీరోయిన్‌ని సెట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. బాబీ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమాలో చిరంజీవికి జంటగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాని సెట్ చేస్తున్నారు మేకర్స్.
‘అఖండ’ సినిమా షూటింగ్‌ని కంప్లీట్ చెయ్యడానికి రెడీ అవుతున్న బాలకృష్ణ.. గోపీచంద్ మలినేనితో తెరకెక్కబోతున్న సినిమాకు ఇప్పటినుంచే అన్నీ రెడీ చేసుకుంటున్నారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలయ్యకు జంటగా మెహరీన్‌ని ఫిక్స్ చేసినట్టు న్యూస్. ఈ మద్య హీరోయిన్లను రిపీట్ చేస్తున్న బాలయ్యను మెహరీన్‌తో సరికొత్తగా చూపిస్తున్నారు మేకర్స్.
మరో సీనియర్ హీరో వెంకటేష్‌కి కూడా ఈసారి సరికొత్త జంట సెట్ అయ్యింది. ‘ఎఫ్ 3’ షూటింగ్‌ని చకచకా చేసే పనిలో బిజీగా ఉన్న వెంకటేష్‌కి ఆల్రెడీ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా ఉంది. కానీ ‘ఎఫ్ 3’ లోనే మరో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ని జత చేస్తున్నారు. అంతకుముందెప్పుడూ పెయిర్‌గా కనిపించని వెంకటేష్, ప్రగ్యా జైస్వాల్.. సరికొత్తగా, ఫ్రెష్‌గా ఎంటర్‌టైన్ చెయ్యబోతున్నారు.