Telangana Weather: రాగల మూడు రోజులు వర్షాలు!
తెలంగాణలో మరో మూడు రోజుల (17,18,19) పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని

Telangana Weather
Telangana Weather: తెలంగాణలో మరో మూడు రోజుల (17,18,19) పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్ 5న తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నైరుతి, పశ్చిమ దిశల నుంచి బలంగా గాలులు వీస్తున్న నేపథ్యంలో జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది.
ఈరోజు దక్షిణ, మధ్య, తూర్పు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ… తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని.. తూర్పు, ఉత్తర, వాయువ్య జిల్లాలలో ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కాగా, గత రెండు రోజుల నుండి పలుజిల్లాలలో వర్షాలు కురుస్తుండగా మహారాష్ట్రతోపాటు దాదాపు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.