వేలానికి బరాక్ ఒబామా షూస్ : ధర ఎంతో తెలుసా..?!

వేలానికి బరాక్ ఒబామా షూస్ : ధర ఎంతో తెలుసా..?!

Updated On : February 12, 2021 / 4:20 PM IST

Barack Obama Shoes Auction: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వాడిన షూస్ ను వేలానికి వచ్చాయి. ప్రముఖ కంపెనీ నైకీ సంస్థ ఒబామా కోసం ప్రత్యేకంగా తయారుచేసి ఇచ్చిన షూస్ ను వేలానికి పెట్టారు. 2009 లో నైకీ సంస్థ ఈ బూట్లను ప్రత్యేకంగా డిజైన్ చేసి అప్పుడు అధ్యక్షుడిగా ఒబామాకు ఇచ్చింది. అధికారిక కార్యక్రమాలకు మినహాయిస్తే మిగతాచోటకు ఎక్కడకు వెళ్లినా ఒబామా ఆ షూష్ ని వేసుకునేవారు.

కాగా..అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అమెరికాకు అధ్యక్షుడైన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికను సంతతికి చెందిన వ్యక్తి. అమెరికా ఖండం బయట జన్మించి అమెరికా అధ్యక్షుడైన మొట్టమొదటి వ్యక్తి కూడా బరాక్ ఒబామానే. అమెరికా 44 వ అధ్యక్షుడిగా రెండుసార్లు అగ్రరాజ్య పగ్గాలు చేపట్టిన అధినేత.

అగ్రారజ్యాధినేతగానే గాక ఆయన వ్యక్తిత్వానికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఒబామా. ఇదిలా ఉండగా..ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన కోసమే నైకీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించుకున్న షూలు ఇప్పుడు వేలం వేయనున్నారు.

రాజకీయాలతో పాటు క్రీడల పట్ల ఆసక్తి ఉన్న నాయకుడు ఒబామా. 1989 లో ఆయన ఒక ఫుట్ బాల్ కప్పును కూడా గెలుచుకున్నారు. ఒబామాకు బాస్కెట్ బాల్ అంటే కూడా చాలా ఇష్టం. దీంతో ప్రముఖ సంస్థ నైకీ సంస్థ ఒబామా కోసం ప్రత్యేకంగా షూస్ ను తయారుచేసి ఇచ్చింది. 2009 లో ఈ బూట్లను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్లినా వాటిని వేసుకునేవారు. కాగా.. ఈ బూట్లను ఇప్పుడు నైకీ సంస్థ వేలం వేయనుంది.

ప్రముఖులు ధరించిన దుస్తులు, కళ్లజోళ్లు, చెప్పులు ఇలా వారు వాడిని వస్తువులను వేలం వేయడం ఎప్పటినుంచో వస్తోంది. వాటిని దక్కించుకోవటానికి చాలామంది పోటీ పడుతుంటారు. దీంట్టో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న బరాక్ ఒబామా వేసుకున్న షూలు శుక్రవారం (జనవరి 12; వేలం వేయనున్నారు.

ఈ షూల ధరను సంస్థ 25 వేల యూఎస్ డాలర్లుగా నిర్ణయించింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 18 లక్షల (రూ. 18,21,575) పైనే. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. 44 సైజు ఉన్న ఈ షూ.. తెల్ల రంగు లో ఉన్నాయి. ఒబామాకు ఇవి ఎంతో ఇష్టమైన స్నీకర్లు. ఈ షూలలో ఫ్లై వేర్ టెక్నాలజీ కూడా ఉంది. అంతేగాక వీటిపై ఒబామా సంతకం కూడా ఉంది. దీంతో ఈ షూస్ వేలం పాటలో మంచి ధర పలుకుతుందని నైకీ భావిస్తోంది.